పక్షిపాతం
అమ్మా! మనకోసం మనుషులు బ్రిడ్జ్ ఆపేశారా!
కాలిఫోర్నియాలోని పాత కాలపు రిచ్మండ్–శాన్ రాఫెల్ వంతెనకు 70 కోట్ల డాలర్ల వ్యయంతో జరుగుతున్న మరమ్మతులు ఒక్కసారిగా ఆగిపోయాయి! అనుకూలించని ప్రకృతో, అమెరికా కొత్త అధ్యక్షుడో ఇందుకు కారణం కాదు. పనులు జరుగుతుండగా వంతెన అడుగున ఓ పక్షి గూడు కనిపించింది. హమ్మింగ్ బర్డ్ గూడు అది! మొదట దానిని భద్రంగా తొలగించి మరమ్మతులు కొనసాగించాలని అనుకున్నారు కానీ, గూడు లోపల చిన్నచిన్న పిల్లలు ఉన్నాయి!
గూడును కదలించే ప్రయత్నంలో ఆ పిల్లలు కిందపడిపోవచ్చు. లేదా గూడు స్థలం మార్చినప్పుడు తల్లి పక్షి మాతృత్వపు ఏకాంతానికి భంగం కలగవచ్చు. అందుకే గూడును డిస్ట్రర్బ్ చెయ్యకుండా వదిలేశారు. వాటంతటవే గూడు వదిలిపోవడం కోసం ఎదురు చూస్తూ పలుగు, పార పక్కన పడేశారు. మనిషి మహామహా వంతెల్ని కట్టగలడు గానీ, ఒక్క పక్షి గూడును నిర్మించలేడు కదా.
రిచ్మండ్–శాన్ రాఫెల్ వంతెన