Rohith reddy
-
పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్
-
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో విభేదాలు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
-
మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ కేటాయింపులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ సయోధ్య కుదిర్చారు. తాండూరు టికెట్‌పై రాజీఫార్ములాలో భాగంగా శాసనమండలి సభ్యుడిగాఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఈ నెల 23న బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పట్నం రాష్ట్ర మంత్రివర్గంలో చేరతారు. 2014 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి ఇద్దరు నేతల నడుమ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని పలుమార్లు బహిరంగంగా విమర్శలకు పూనుకున్నారు. చదవండి: పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే.. 2023లో తాండూరు అసెంబ్లీ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించారు. రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించాలని మహేందర్‌రెడ్డిని కోరడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్త్‌లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మండలి నుంచి కేబినెట్లోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 2021 మే నెలలో ఈటలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన నాటి నుంచి కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం కుదిరిన రాజీ ఫార్ములామేర కేబినెట్లో ఖాళీగాఉన్న బెర్త్‌లో పట్నం మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. మహేందర్‌రెడ్డి సుమారు 3 నెలలపాటు మంత్రిగా అధికారిక హోదాలో పనిచేస్తారు. -
TS Election 2023: ‘పట్నం’ శిబిరంలో అలజడి.. పదవుల కోసం టికెట్ త్యాగం చేస్తారా..?
వికారాబాద్: తాండూరులో టికెట్ పంచాయితీ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో మళ్లీ రచ్చమొదలైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికల సమరం సమీపిస్తుండడంతో పార్టీ అధిష్టానం సైతం బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది. తాండూరు నియోజకవర్గ టికెట్ కేటాయింపు విషయమై పట్నం మహేందర్‌రెడ్డి శిబిరంలో అలజడి మొదలయింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికే వస్తుందంటూ ధీమాతో ఉన్న ఆయన అనుచరుల్లో ఒక్కసారిగా నైరాశ్యం నెలకొంది. శనివారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ రంజిత్‌రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. తాండూరు అసెంబ్లీ స్థానంలో పోటీ విరమించుకుంటే మంత్రి పదవితోపాటుగా రాజ్యసభకు పంపించేందుకు సీఎం కేసీఆర్ అనుకూలంగా ఉన్నారని నచ్చజెప్పారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆదివారం విషయం తెలుసుకున్న పట్నం వర్గీయులు మండల స్థాయి నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చే స్తూ ఆందోళన చెందుతున్నారు. అయితే పట్నం ఈ విషయమై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. జంబో జాబితా తర్వాతే నిర్ణయం.. బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జంబో జాబితా బయటకు వచ్చాకే పట్నం మహేందర్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన అనుచరగణం అంటున్నారు. కాగా తాండూరు నుంచి టికెట్ రాకపోతే తన వెంట నడిచేవారెందరున్నారని ఆయన లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది నాయకులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అనుకూలంగా ఉంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాలతో అన్నట్లు తెలిసింది. నియోజకవర్గ స్థాయిలో మహేందర్‌రెడ్డికి బలమైన కేడర్ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారికి టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో పైలట్ పేరు తొలి జాబితాలోనే వస్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పదవుల కోసం టికెట్ త్యాగం చేస్తారా..? తాండూరు నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి ఆరు సార్లు పోటీ చేయగా .. నాలుగు సార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాండూరు నుంచే పోటీ చేస్తానంటూ ఆయన పలుమార్లు ప్రకటించారు. అయితే శనివారం బీఆర్ఎస్ పెద్దలతో జరిగిన చర్చల్లో పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవితో పాటు సతీమణి జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డిని రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఆయన నియోకవర్గ ముఖ్య నాయకుల అభిప్రా యం తీసుకుంటున్నారు. మరో రెండు మూడు రో జుల్లో తాండూరు అసెంబ్లీకి పోటీ చేస్తారా.. లేక పదవులతో సైలెంట్ అయిపోతారా అనేది స్పష్టత రానుంది. ఈ విషయమై పట్నం మహేందర్‌రెడ్డిని వివరణ కోరగా తాను తాండూరు అసెంబ్లీని వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోటీ చేయడం ఖాయమన్నారు. -
తాండూరు నియోజకవర్గంలో విజయం సాధించేది ఎవరు..?
తాండూరు నియోజకవర్గం తెలంగాణ అంతటా టిర్ఎస్ గాలివీస్తే తాండూరులో మాత్రం 2018 ఎన్నికల సమయం వరకు మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి ఓటమి పాలవడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో బలమైన నేతగా తయారైన ఆయన ఈ ఎన్నికలో ఓటమి చెందారు. ఆయనపై కాంగ్రెస్ ఐ అభ్యర్ది పైలట్ రోహిత్ రెడ్డి విజయం సాదించారు. రోహిత్‌కు 2875 ఓట్ల ఆధిక్యత లభించింది. తదుపరి రోహిత్ కూడా టిఆర్ఎస్లో చేరిపోయారు. గతంలో మహేందర్ రెడ్డి మూడుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్ఎస్ తరపున గెలిచారు. రోహిత్ రెడ్డికి 70428 ఓట్లు, మహేందర్ రెడ్డికి 67553 ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన రోహిత్ రెడ్డి మొదటి సారి గెలుపొందారు. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన పటేల్ రవిశంకర్‌కు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ది, మాజీ ఎమ్మెల్యే నారాయణరావుపై 15982 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. అంతకుముందు మూడుసార్లు టిడిపి పక్షాన గెలుపొందగా 2014లో టిఆర్ఎస్లోకి వెళ్లి గెలిచారు. తదుపరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంత్రివర్గంలో మహేంద్రరెడ్డికి స్థానం లభించింది. కాని 2018లో మహేందర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. తాండూరులో ఏడుసార్లు రెడ్లు గెలుపొందారు. ఏడుసార్లు బిసి నేతలు విజయం సాధించారు. ఒకసారి బ్రాహ్మణవర్గం నేత విజయం సాధించారు. తాండూరు నియోజకవర్గంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండుసార్లు గెలిచారు. ఈయన వికారాబాద్, మేడ్చల్, సనత్‌నగర్‌లలో మరోనాలుగుసార్లు గెలుపొందారు. చెన్నారెడ్డి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేసారు. కేంద్రంలో కొంతకాలం మంత్రిగా ఉన్నారు. 1967లో గెలిచాక ఈయన ప్రత్యర్ధిగా ఉన్న వందేమాతం రామచంద్రరావు ఎన్నికల పిటీషన్ వేయగా, కోర్టు ఈయనను అనర్హుడిగా ప్రకటించింది. దాంతో కేంద్రంలో పదవికి చెన్నారెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సమయంలో వచ్చిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ తరువాత కాలంలో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని, నాలుగు రాష్ట్రాలకు గవర్నరు పదవినిచేపట్టారు. మధ్యలో కొంతకాలం నేషనల్ డెమొక్రాటిక్ పార్టీని నెలకొల్పి 1984లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి టిడిపి మద్దతుతో పోటీచేసి ఓడిపోవడం విశేషం. తిరిగి 1989 నాటికి కాంగ్రెస్ ఐలో చేరి మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1969లో ఉప ఎన్నికద్వారా శాసనసభకు ఎన్నికైన ఎమ్.మాణిక్యరావు 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మరో రెండుసార్లు గెలిచిన మాణిక్యరావు కొంతకాలం పి.వి.అంజయ్య భవనం కోట్ల మంత్రివర్గాలలో సభ్యులయ్యారు. మాణిక్యరావు సోదరుడు ఎమ్.చంద్రశేఖర్ రెండుసార్లు ఇక్కడ నుంచి గెలిచి మంత్రి పదవిని కూడా నిర్వహించారు. 2004లో వీరి మరో సోదరుడు నారాయణరావు కూడా ఇక్కడ నుంచి గెలిచారు. 2009లో మాణిక్‌రావు కుమారుడు రమేష్ పోటీచేసి ఓడిపోయారు. తాండూరు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పైలెట్ రోహిత్‌రెడ్డి..!
-
ముగ్గురు ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న ఎమ్మెల్సీ.. బీఆర్ఎస్లో కోల్డ్‌వార్!
వికారాబాద్ జిల్లా గులాబీ పార్టీలో రాజకీయాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలనే టెన్షన్ పెడుతున్నాయి. ఓ మాజీ మంత్రి అసంతృప్తితో రగిలిపోతూ ఎమ్మెల్యేలను ముప్పతిప్పలు పెడుతున్నారని టాక్. తెరవెనుక పావులు కదుపుతూ తమను దెబ్బతీస్తున్నారని ఆ సీనియర్ నేత గురించి ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న ఆ సీనియర్ ఎవరు?.. పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణలో మాజీ మంత్రి.. ప్రస్తుత ఎమ్మెల్సీ. మూడు దశాబ్ధాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తెర వెనక చక్రం తిప్పడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. నాలుగు సార్లు తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ తొలి క్యాబినెట్లో బెర్త్ సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి మండలిలో ప్రవేశించారు. వరుసగా మూడు సార్లు తన సతీమణి పట్నం సునీతారెడ్డిని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గెలిపించుకున్నారు. తన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా, ఆ తర్వాత కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ట్రాక్ రికార్డ్ ఘనంగానే ఉన్నా.. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యేలదే ఫైనల్ డెసిషన్ కావడంతో ఇన్నాళ్లు స్థబ్ధుగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మహేందర్ రెడ్డి తనదైన శైలిలో తెరవెనక పావులు కదుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. మహేందర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తాండూరులో ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గంగా బీఆర్ఎస్ చీలిపోయింది. ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ చాలాసార్లు రచ్చకెక్కింది. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌తో కూడా మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి పొసగడం లేదు. గతంలో మర్పల్లిలో పర్యటించిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సునీతారెడ్డిపై ఎమ్మెల్యే ఆనంద్ తన వర్గీయులతో దాడి చేయించారనే ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మహేందర్ రెడ్డి.. ఆనంద్ మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల వికారాబాద్ లో ఎమ్మెల్యే ఆనంద్ వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆనంద్ వర్గీయులు సమావేశం దగ్గరకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. ఈ పంచాయితీ కాస్తా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్దకు చేరింది. ఇరువర్గాలకు మంత్రి ఎలాంటి భరోసా ఇస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి.. తనకు వ్యతిరేకంగా రోహిత్ రెడ్డి, ఆనంద్‌తో కలిసి జట్టు కట్టారని గుర్రుగా ఉన్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. పరిగిలో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న మనోహర్ రెడ్డిని తనవైపు తిప్పుకుని మహేంద్రుడు చక్రం తిప్పుతున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కునుకు లేకుండా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తన వ్యతిరేకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. -
రోహిత్ రెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు
-
కావాలనే ఈడీ కేసు.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తూ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పది రోజుల క్రితం ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ (పీఎంఎల్ఏ) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. ఇప్పటికే ఈడీ విచారణకు రెండుసార్లు హాజరయ్యానని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాను ఫిర్యాదుదారుడినని, అందుకే ఈడీ కావాలనే కేసు నమోదు చేసిందన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మనీల్యాండరింగ్ జరగలేదని, అయినా ఆ కేసును నీరుగార్చే క్రమంలోనే ఈడీ మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిందన్నారు. గుట్కా వ్యాపారి అభిషేక్, ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుకుమార్‌ను కూడా ఈడీ ప్రశ్నించిందని వెల్లడించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులను సిట్ విచారణ జరుపుతున్న క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగిందన్నారు. మనీ ల్యాండరింగ్ జరిగింది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేకున్నా... తమ వద్ద ఉన్నాయని ఈడీ చెబుతోందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న బీజేపీ–బీఆర్ఎస్ల మధ్య తీవ్ర రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల ఎర కేసు నుంచి బయటపడేందుకే ఈడీతో తప్పుడు కేసును తనపై బనాయించారని ఆరోపించారు. ఈడీ పరిధి దాటి కేసు నమోదు చేసిందన్నారు. వెంటనే ఈడీ కేసు దర్యాప్తును నిలిపివేయాలని, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఈడీ జాయింట్ డైరెక్టర్, ఈడీ డిప్యూటీ డైరెక్టర్(హైదరాబాద్), ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్(హైదరాబాద్)ను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఈ పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టనున్నారు. -
ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి గైర్హాజరు
-
పైలెట్ రోహిత్‌రెడ్డి వ్యవహారం.. ఈడీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తాండూరు(వికారాబాద్ జిల్లా) ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గరం గరంగా ఉంది. విచారణకు గైర్హాజరు అవుతుండడంతో ఆయనపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ఈడీ దర్యాప్తు సైతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నోటీసులు అందుకుని విచారణకు సహకరిస్తా అంటూనే పైలెట్ రోహిత్‌రెడ్డి గైర్హాజరు అవుతూ వస్తున్నారు. ఇవాళ సైతం ఆయన గైర్హాజరు కావడంతో ఈడీ సీరియస్‌గా ఉంది. ఇప్పటికే రెండు రోజులు రోహిత్ రెడ్డి ని విచారించిన ఈడీ, నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో.. మరోమారు రోహిత్ రెడ్డి నీ విచారించేందుకు సిద్దమైంది. కానీ, ఆయన రాలేదు. ఈడీ విచారణ హాజరుపై రోహిత్ రెడ్డి మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఈడీ భావిస్తోంది. మరోవైపు.. ఆయన హైకోర్టుకు వెళ్లడంపైనా ఈడీ రగిలిపోతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను ఈడీ ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో ఆరోపించారు. ఈడీ ఈసీఐఆర్ కింద కేసు నమోదు చేసిందని, ఈ కేసును కొట్టేయాలని అభ్యర్థించారు. మనీలాండరింగ్ కింద నోటీసులిచ్చి తనను వేధిస్తున్నారని రోహిత్‌రెడ్డి అందులో పేర్కొన్నారు. అంతకు ముందు ఈడీ విచారణకు హాజరయ్యే అంశంపై స్పందిస్తూ.. ఈడీ విచారణపై హైకోర్టులో పిటిషన్ వేశానని స్పష్టం చేశారు. తన పిటిషన్ పై హైకోర్టు విచారించనుందని తెలిపారు. ఈడీ విచారణకు వెళ్లాలా వద్దా అనే విషయంపై తన లాయర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. -
ఈడీ వేధింపులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా: రోహిత్ రెడ్డి
-
ఈడీకి సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటోంది: పైలెట్ రోహిత్ రెడ్డి
-
నేను గులాబీ సైనికుడిగా బీజేపీ కుట్రలను తిప్పికొడతా : పైలెట్ రోహిత్ రెడ్డి
-
మాణిక్ చంద్ గుట్కా కేసులోనే రోహిత్ రెడ్డి ఈడీ విచారణ ?
-
రెండవ రోజు ఈడీ ముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
-
నేను రెడీ.. మీరూ సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తన ఆస్తులు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నానని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా తమ ఆస్తుల వివరాలు ప్రకటిస్తారా అని బీజేపీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు సూటిగా ప్రశ్నించారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలన్నీ ప్రకటిస్తారా ? అని నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనది అక్రమ సంపాదన అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. అక్రమంగా సంపాదించి ఉంటే గత ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. గతంలో పటాన్చెరు పరిశ్రమల్లో తాను డబ్బు వసూలు చేసినట్టు ఎవరైనా ఫిర్యాదు చేశారా ? ఇన్నాళ్లూ దానిపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన తప్పుడు సమాచారంపై రోహిత్‌రెడ్డి సమాధానం చెప్పాలనీ, అసలు ఆయన డ్రగ్స్ తీసుకున్నారా? లేదా ? బెంగళూరు కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా.. అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. వీటన్నింటిపై రోహిత్‌రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద మాట్లాడితే బాగుండేది. అయ్య ప్పమాలలో ఉండి.. అసభ్యంగా మాట్లాడారు. అయ్యప్పమాల తీశాక అన్నింటికీ సమాధానం చెబుతాను’ అని రఘునందన్ వ్యాఖ్యానించారు. తప్పు చేశారు కాబట్టే రోహిత్‌రెడ్డి భయపడుతున్నారనీ ఈడీ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్‌రావు నిందించారు. -
ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
-
మరికాసేపట్లో ఈడీ ముందుకు రోహిత్ రెడ్డి
-
అయ్యప్ప మాలలో ఉండి రోహిత్ అసత్యాలు మాట్లాడుతున్నాడు : రఘునందన్ రావు
-
డ్రగ్స్ కేసులో తన ప్రమేయాన్ని రుజువు చేయాలనీ బండి సంజయ్ కు సవాల్
-
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం అదనపు డైరెక్టర్ దేవేందర్ కుమార్ సింగ్ పేరుతో, 15వ తేదీతో (గురువారం) ఈ సమన్లు ఉన్నాయి. 2015 నుంచి రోహిత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ దాని నమూనాను నోటీసులతో జత చేసింది. రోహిత్‌రెడ్డిపై తొమ్మిది కేసులు రోహిత్ రెడ్డి 2018లో నామినేషన్‌తోపాటు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనపై మొత్తం 9 కేసులు ఉన్నాయి. ఇవన్నీ 2017–18 మధ్య తాండూరుతోపాటు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో నమోదయ్యాయి. వీటిలో అత్యధికం ఎన్నికల సంబంధిత నేరాలే. ఒక్క కేసులో మాత్రమే మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులోనూ రోహిత్‌రెడ్డి పేరు వినిపించింది. నిర్మాత శంకరగౌడ్ బెంగళూరులో గతేడాది ఇచ్చిన పార్టీకి రోహిత్‌రెడ్డి హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. నైజీరియన్ అరెస్టుతో గుట్టురట్టయిన ఈ వ్యవహారంలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్ విదేశాల నుంచి వచ్చినట్లు అక్కడి నార్కోటిక్ అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబం«ధించి ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు విచారించారు. వీరిలో కొందరు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులను ఆ పార్టీకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమేయంపై వార్తలు వెలువడ్డాయి. ఆ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రోహిత్‌రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిందో తెలియాల్సి ఉంది. ఏ కేసు ప్రస్తావన లేకుండా ఈడీ ఇచ్చిన నోటీసులపై రోహిత్‌రెడ్డి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఈడీ ఎలాంటి కేసులను దర్యాప్తు చేస్తుంది? ఈడీ అధికారులు రెండు చట్టాలకు సంబంధించిన కేసులను మాత్రమే దర్యాప్తు చేస్తుంటారు. పీఎంఎల్ఏతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మాత్రమే కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటుంది. ఫెమా చట్టాన్ని ఈడీ అధికారులే నేరుగా వినియోగించవచ్చు. విదేశీ మారకద్రవ్యాలకు సంబంధించిన లావాదేవీలున్న అంశాలనే ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు చేస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, విచారణకు నోటీసులు అందుకున్న వారు ఏదో ఒక కోణంలో విదేశీ కరెన్సీ లావాదేవీలు చేసి ఉండాలి. అయితే పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు ఓ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలంటే మాత్రం నేరుగా కుదరదు. అప్పటికే ఏదో ఒక పోలీసుస్టేషన్ లేదా సీబీఐ వంటి ప్రత్యేక విభాగంలో కేసు నమోదై ఉండాలి. ఆ ఎఫ్ఐఆర్ ఆ«ధారంగానే ఈడీ పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేస్తుంది. ఏదైనా కేసులో ఓ వ్యక్తి నిందితుడు కాకపోయినప్పటికీ... నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విచారణలో పేరు వెలుగులోకి రావడమో, వారి వాంగ్మూలాల్లో ప్రస్తావన ఉండటమో జరిగినా ఈడీ నోటీసులు ఇచ్చి విచారించే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఏదో ఒకచోట నమోదైన కేసు ఆధారంగానే రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. మరోసారి రకుల్‌కు నోటీసులు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ అధికారులు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈమెను సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసుకు సంబం«ధించి ఇప్పటికే ఈడీ రకుల్‌ను ఓసారి విచారించింది. ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే అప్పట్లో ఎక్కడా రకుల్ పేరు బయటకు రాలేదు. తర్వాత ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన ఓ డ్రగ్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్‌ను గత సెప్టెంబర్ 3న ప్రశ్నించింది. తాజాగా రకుల్‌ను ఏ అంశాలపై, ఎవరితో సంబంధాలపై, ప్రశ్నిస్తారనే ఉత్కంఠ నెలకొంది ఇదీ చదవండి: హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్ -
‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. వీడని చిక్కు.. ఎవరికి లక్కు!
సాక్షి, వికారాబాద్: తాజా రాజకీయాలు తాండూరు చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో అంతుపట్టని విధంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు టికెట్ ఎవరికనే చర్చ అధికార పార్టీలో జోరుగా జరుగుతోంది. గతంలో తాండూరు స్థానం నాదంటే.. నాది అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బాహాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ‘ఎర’ అంశం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఘటన జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా స్పష్టత రావడంలేదు. ప్రస్తుతం వారి రాజకీయ భవిష్యత్‌పై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య పోటీ తీవ్రం తాండూరులో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యతతో రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తన అనుచరులను సైతం వెంట తెచ్చుకొన్నారు. పదవుల విషయంలోనూ.. తాండూరు అసెంబ్లీ స్థానం కోసం పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పైలెట్ రోహిత్‌రెడ్డి ఆశిస్తున్నారు. రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినా మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు పార్టీ, నామినేట్ పదవుల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. తాండూరు అసెంబ్లీ టికెట్ సీఎం కేసీఆర్ తమకే ఇస్తారని ఇద్దరు నేతలు ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు రాజకీయంగా, అధికారికంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పైచేయిగా నిలిచారు. కలిసొచ్చేది ఎవరికో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందనేది తాజాగా చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపునకు బీజేపీ నాలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగడం.. కథ అడ్డం తిరిగి మధ్య వర్తులు జైలు పాలవడం నాలుగు రోజుల వ్యవధిలో చకచక జరిగిపోయాయి. అయితే ఇందులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా ఈ వ్యవహారం తాండూరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరి రాజకీయ భవిషత్ను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్: మంత్రి హరీష్‌రావు -
నెలలు నిండని కాన్పు!
మీడియాలో కనిపించినంత సంచలనం జనంలో కనిపించ లేదు. ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌ను చూసి ప్రజలు ఆశ్చర్యచకితు లైనట్టుగా దాఖలాలు ఎక్కడా దొరకలేదు. సంతలో పశువుల బేరానికి దీటుగా ప్రజా ప్రతినిధుల్ని వేలం వేసినా ఎవరూ అవాక్కయ్యే పరిస్థితి లేదు. రచ్చబండ మీద ప్రజాస్వామ్యాన్ని తులాభారం వేసినా ఎవరూ దిగ్భ్రాంతికి గురయ్యే అవకాశమే లేదు. సమస్త జనావళి హృదయాల్లోంచి సున్నితత్వాన్ని పారద్రోలి దిటవు గుండెలు ప్రసాదించిన మన రాజకీయ పార్టీలకు జేజేలు. తమ మాటల ద్వారా, చేతల ద్వారా మన పార్టీలు ప్రజలకు స్థితప్రజ్ఞతను అనుగ్రహించాయి. తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి ద్వారా వేయించిన ఫామ్‌హౌస్ బాంబు నుంచి పొగ మాత్రమే వచ్చింది. అది సరిగ్గా పేలకపోవడానికి చాలా కారణా లున్నాయి. ఫిరాయింపుల అండతో రాజ్య విస్తరణ చేసుకోవ డానికి భారతీయ జనతా పార్టీ తహతహలాడుతున్నదనేది బహిరంగ రహస్యం. అప్రజాస్వామికమైన పద్ధతులతో, అపవిత్రమైన ఎత్తుగడలతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అది కూల్చివేసిందన్న విషయం కూడా అక్షరసత్యం. రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ వ్యవస్థకూ, ఈ నేల తల్లి వెదజల్లే సహజ సుగంధమైన లౌకికత్వానికీ కేంద్రం ఉరితాళ్లు పేనుతున్న సంగతి కూడా ముమ్మాటికీ నిజం. తన రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా తెలంగాణను తదుపరి టార్గెట్‌గా ఎంచుకున్నదని రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైంది. ఈ మహత్తర కార్యసాధన కోసం కూడా అది ఫిరాయింపుల బాటనే ఎంచుకున్నది. అతి త్వరలోనే తమ పార్టీలో కొందరు అధికార పార్టీ ప్రముఖులు చేరబోతున్నారని రాష్ట్ర బీజేపీ నాయకులు పలు సందర్భాల్లో ప్రకటించారు. కనుక మొన్నటి ఎపిసోడ్ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఇటువంటి ఫిరాయింపుల బాగోతాన్ని ఎండగట్టాలని అధికార టీఆర్ఎస్ పార్టీ భావించడంలో తప్పేమీ లేదు. అందుకోసం అది ఎటు వంటి ట్రాప్ విసిరినా సమర్థనీయమే. అయితే ఈ వ్యవహారాన్ని ట్రాప్ చేశారా లేక డిజైన్ చేశారా అన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై శనివారం మధ్యాహ్నం వరకూ ‘లీకు’లపైనే మీడియా ఆధారపడవలసి వచ్చింది. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఒక్కటే అధికారిక పత్రం. మిగిలినవన్నీ లీకులే. నిందితుల రిమాండ్‌ను తిరస్క రిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును శనివారం మధ్యాహ్నం హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాతనే రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ కీలక నాయకుడైన కేటీఆర్ మీడియాతో మాట్లాడతారన్న సమాచారం వచ్చింది. కానీ, కేసు దర్యాప్తు జరుగుతున్న దశలో దానిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. బుధవారం నాటి వ్యవహారానికి కార్యస్థలం మొయినాబాద్ సమీపంలోని రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్. రాత్రి 7–8 గంటల మధ్యన సైబరా బాద్ పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఇంకో గంట తర్వాత మీడియాకు ఉప్పందింది. ఫామ్‌హౌస్‌లో వంద కోట్ల రూపాయల నగదు దొరికిందని మీడియాకు లీకులందాయి. దాన్ని కొంతసేపు ప్రసారం చేసిన తర్వాత దొరికిన నగదును 15 కోట్లకు తగ్గిస్తూ మరోసారి ‘లీక్’ వచ్చింది. చివరకు అర్ధరాత్రి సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడినప్పుడు డబ్బుల ప్రస్తావన రాలేదు. ఈ కప్పదాట్లకు కారణమేమిటో పోలీసులు వివరణ ఇవ్వకపోగా తప్పంతా మీడియాదేనని దులిపేసుకున్నారు. ఇప్పటివరకు లీకుల ద్వారా వచ్చిన సమా చారాన్ని బట్టి అక్కడ డబ్బేమీ దొరకలేదని అనుకోవాలి. నిందితులుగా పేర్కొంటున్న ఆ ముగ్గురి సంభాషణల్లో ‘వంద’ అనే మాట మాత్రం దొర్లింది. ఆ ముగ్గురిలో స్థానిక బ్రోకర్‌గా చెబుతున్న నందు అనే వ్యక్తికి కచ్చితమైన రాజకీయ విధేయత ఏమీ లేనట్టు తెలుస్తున్నది. అన్ని పార్టీల నాయకులతో పరిచయాలు పెంచు కొని, ఫోటోలు దిగి, ప్రచారం చేసుకునే తరహా వ్యక్తిగా అర్థ్ధమవుతున్నది. మిగిలిన ఇద్దరు కూడా బీజేపీ నాయకులుగా అంతగా గుర్తింపు పొందినవారు కాదు. వాళ్ల మాటల్లో బీజేపీ అగ్రనేతల పేర్లు దొర్లినంత మాత్రాన అది సాక్ష్యంగా పనికి వస్తుందా? సమాజంలో చాలామంది మోసగాళ్లు తమకు వీవీఐపీలతో దగ్గరి పరిచయముందని అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. మోసపోయిన అమాయకులు సదరు వీవీఐపీ లపై కేసు పెడతానంటే ఒప్పుకుంటారా? ఇప్పటి వరకు బయట కొచ్చిన వివరాలను బట్టి ఈరకంగా ఆలోచించవలసి వస్తున్నది. ఇంతకుమించిన సాక్ష్యాలు ఇంకేమన్నా ఉన్నాయా? ఉంటే ఆ ‘లీకు’లు ఎప్పుడు ఎలా బయటకు వస్తాయో తెలియదు. ఇది నిజంగా బీజేపీ ఆపరేషన్‌లో భాగమే అనుకుందాము. ఆ ‘నిందితులు’ బీజేపీ కేంద్ర నాయకత్వం పనుపునే పని చేస్తున్నారని అనుకుందాము. వారి మాటల ప్రకారం ఈ నలు గురి చేరిక పక్కా అయితే పార్టీ అగ్ర నాయకులు రంగంలోకి వస్తారు. ఇంకో రెండు మూడు రోజులు వేచి ఉంటే ఆ కన్నపు దొంగల్ని కన్నంలోనే పట్టేసుకొని ఉండేవారు కదా? అంతటి అద్భుతమైన, అమూల్యమైన అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకున్నారు? జాతీయ స్థాయిలో బీజేపీని దోషిగా నిలబెట్టే తిరుగు లేని సందర్భాన్ని ఎందుకు కాలదన్నుకున్నారు? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రం తరువాత రాష్ట్రాన్ని కబళిస్తూ వస్తున్న బీజేపీ దండయాత్రకు ముకుతాడు వేయడం కోసం మరో రెండు రోజులు ఎందుకు ఓపిగ్గా ఉండలేకపోయారు? సీబీఐ, ఐటీ, ఈడీల త్రిశూల ప్రహారంతో గిట్టని రాజకీయ పక్షాలపై కక్ష సాధిస్తున్న కాషాయ పార్టీని బోనెక్కించగల బంగారు ఘడియల కోసం ఎందుకు ఎదురుచూడలేకపోయారు? సామాన్యుల మెదళ్లలో ఇటువంటి ప్రశ్నలు మొలకెత్తడం సహజం. రేపోమాపో ఈ సందేహాలను పటాపంచలు చేయగల మరిన్ని ఆడియో వీడియో సాక్ష్యాలు బయటకొస్తాయేమో చూడాలి. అప్పటిదాకా ఈ లీకుల వ్యవహారాన్ని ప్రీ మెచ్యూర్ డెలివరీగానే పరిగణించవలసి ఉంటుంది. ఈ నెలలు నిండని కాన్పు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పెద్దలు ఎందుకు ఎంచుకొని ఉంటారు? మునుగోడు ఉపఎన్నికను ప్రభావితం చేయడం అనేది తప్ప మరో తక్షణ కారణం కనిపించడం లేదు. అధికారంలో ఉండి, అనేక జనరంజక కార్యక్రమాలను అమలుచేస్తున్న పార్టీ ఒక ఉపఎన్నికలో గెలవడం కోసం బ్రహ్మాస్త్రాలను ఆశ్రయించవలసిన అగత్యం ఉంటుందా? ఇప్పటికే రెండూళ్లకో ఎమ్మెల్యే, పదూళ్లకో మంత్రి చొప్పున మోహరించి నెలరోజు లుగా కోరిన వరాలను తీరుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రమాదకరమైన శత్రువు బలంగా దూసుకొస్తున్నాడన్న అభిప్రాయం కలిగినప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసు కోవడం తప్పులేదని అనుకుందాము. కానీ ఆ జాగ్రత్తలు ఏ మేరకు సత్ఫలితాలనిస్తున్నాయనే గ్రహింపు కూడా అవసరం. క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి, వివిధ సంస్థలు చేపట్టిన సర్వేలను బట్టి చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర్నుంచీ నేటివరకూ అధికార టీఆర్ఎస్ పార్టీ మెరుగైన స్థితిలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆధిక్యతలో హెచ్చుతగ్గులుంటు న్నాయే తప్ప పూర్తిగా ఎప్పుడూ దిగజారలేదు. పదిరోజుల కింద ఉన్నంత మెరుగైన పరిస్థితి ఆడియో టేపుల లీకుల తర్వాత ఈరోజున లేదు. ఆ టేపుల్లో ఉన్న బాగోతం జనంలోకి పూర్తిగా చేరలేదా? చేరినా ప్రయోగం ఫలించలేదా? అన్నది తేలవలసి ఉన్నది. ఒక ఉపఎన్నికలో ఇంతగా సర్వశక్తులు ఒడ్డి పోరాడు తున్నప్పటికీ యాభై శాతం ఓట్లను సంపాదించే పరిస్థితిలో మాత్రం టీఆర్ఎస్ లేదని చెప్పవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోణంలో ఆలోచిస్తే ఇది ఆ పార్టీకి ఆందోళన కలిగించే విషయమే. రెండు ప్రధాన ప్రతిపక్షాల మధ్య వ్యతిరేక ఓటు చీలిపోతే తాము సులభంగా గట్టెక్కగలమనే ఆలోచన ఆ పార్టీ పెద్దలకు ఉండవచ్చు. ఇటువంటి అంచనాలు తప్పనిసరిగా నిజం కావాలనే రూలేమీ లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉంటే ఈ రూల్ మారవచ్చు. ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత వ్యతిరేకత సహజం గానే ఉంటుంది. అది తీవ్రంగా ఉంటే ఒక ప్రతిపక్షం పూర్తిగా బలహీనపడి మరొకటి బలపడవచ్చు. దుబ్బాక, హుజూరాబాద్ లలో జరిగింది అదే. ఆ రెండుచోట్లా ప్రభుత్వ వ్యతిరేకత కంటే గెలిచిన అభ్యర్థుల పట్ల సానుభూతి ఈ పోలరైజేషన్‌కు కారణ మైంది. మునుగోడులో కూడా మూడో పార్టీ అభ్యర్థి, ఆ పార్టీకి ఉన్న పలుకుబడి స్థాయిలో ఓట్లు రాబట్టలేక పోవచ్చన్న అంచనాలున్నాయి. ఇక్కడ సింపతీ ఫ్యాక్టర్ లేదు. కనుక మూడో ప్రతి పక్షం ఓట్లు రెండో ప్రతిపక్షానికి బదిలీ అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరుగుతున్నట్టుగానే పరిగణించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలంటే, జాతీయ స్థాయిలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడ టంతో సమానంగా ఇల్లు చక్కదిద్దుకోవడానికి ప్రాధాన్య మివ్వాల్సి ఉంటుంది. టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే ఓటు కూడా బలంగానే ఉన్నది. కుల, మత, జాతి భేదాలకతీతంగా పెన్షనర్ల ఓట్లు గుండుగుత్తగా కారు గుర్తుకే పడతాయి. రైతుబంధు పథకం ఫలితంగా రైతుల్లో సానుకూలత ఉన్నది. ఖరీఫ్ కాలంలో గరిష్ఠంగా సాగుచేసిన రైతు కుటుంబాల సంఖ్య 60 లక్షలు. వీరిలో రమారమి 20 లక్షలమంది కౌలు రైతులు. ఇందులో సొంత భూమి కొంత ఉండి కొంత కౌలుకు తీసుకునేవారిని మినహాయిస్తే కౌలు మీదనే ఆధారపడే వారి సంఖ్య పది పన్నెండు లక్షలుండవచ్చు. వీరికి ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నది. మిగిలిన 50 లక్షలమందిలో 15 లక్షలమంది ధరణి వల్ల చిక్కులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా రైతుల్లో మూడింట రెండొంతుల మంది అనుకూలంగా, ఒక వంతు మంది వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రధానంగా యువతరం నుంచి టీఆర్ఎస్ ఛాలెంజ్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. బలహీనవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఎంపవర్ చేయడం ఎజెండాలో తొలి అంశం కావాలి. అందుకు మొదటి మెట్టు విద్యారంగం. బలహీనవర్గాల పిల్లలు చదివే పాఠశాల లపై ప్రభుత్వం సరైన ఫోకస్ పెట్టలేదు. గురుకులాలను మినహాయిస్తే రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 22 వేల స్కూళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. వీటిని బాగుచేయడానికి చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. డీఈవోలు, ఎంఈవోల పోస్టుల్లో ఎక్కువ భాగం ఖాళీగానే ఉన్నాయి. విద్యా వలంటీర్ల సంఖ్య 18 వేల నుంచి 12 వేలకు పడిపోయింది. టీచర్లకు చిరకాలంగా పదోన్నతులు లేవు. పాఠశాల విద్యాశాఖలో 20 శాతం ఖాళీలు న్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంటెక్ల ఫీజులు భారీగా పెరిగాయి. సీఎమ్ఐఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలో తాజా నిరుద్యోగితా రేటు 8.35 శాతం. భారతదేశపు సగటు నిరుద్యోగితా రేటు 6.43 శాతం. విద్యా–ఉపాధి కల్పన అంశాలపై దృష్టిపెట్టకపోతే వచ్చే ఎన్ని కల్లో యువతరాన్ని ఆకర్షించడం కష్టమే. భావోద్వేగ అంశాలతో ఈసారి వారు ప్రభావితం కాకపోవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com