16న రూప్‌టాప్ సోలార్ ఎక్స్ పో మేళా
దానవాయిపేట(రాజమహేంద్రవరం):
ఏపీఈపీడీసీఎల్ ఆధ్వరంలో నవంబర్ 16వ తేదీన రూప్ టాప్ సోలార్ ఎక్స్ పో మేళాను నిర్వహిస్తున్నట్టు రాజమహేంద్రవరం డివిజనల్ ఇంజనీర్ జి.శ్యాంబాబు, నెడ్‌క్యాప్ డీఎం జి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం గోదావరి గట్టు వద్ద గల ఆపరేష¯ŒS సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోలార్ ఎక్స్ పో మేళాకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. సర్కిల్ కార్యాలయంలో ఆవరణలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించే ఈ ఎక్స్పో లో రూప్‌టాప్ సోలార్ ఉత్పత్తి, నెట్ మీటరింగ్ వ్యవస్థపై ఆవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. .ఈ కార్యక్రమానికి సంస్థ సీఎండీ ఎం.ఎం.నాయక్, సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి ముఖ్య అతిథులుగా హజరవుతారని, ఎగ్జిబిష¯ŒSలో మొత్తం పది స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వాటిలో 2 స్టాల్స్ బ్యాంక్ అధికారులకు కేటాయించగా, మిగిలిన 8 స్టాల్స్ వివిధ సోలార్ పానల్స్ ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్లకు కేటాయిం చినట్టు తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ పరిధికి 85 మేగా ఓల్ట్్సను కేటాయిం చగా, జిల్లాకు 15 మేగా ఓల్ట్్సను అందిస్తున్నట్టు వివరించారు. గృహ వినియెగదారులకు ఒక కిలో వాట్‌కు సోలార్ ఉత్పాదనకు 10 చదరపు అడుగుల కనీస పై కప్పు స్థలం ఉండాలి. దీనికి అయ్యే ఖర్చు రూ.89,998 కాగా 50 శాతం సబ్సిడీ ఉం టుందన్నారు. ఒక యూనిట్‌కు రూ.5.60 పైసలు ఖర్చు అవుతుందని తెలిపారు. గృహ, వాణిజ్య వినియోగదారులకు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. సమావేశంలో రాజమహేంద్రవరం టౌ¯ŒS –1 ఏడీఈ శ్రీధర్ వర్మ పాల్గొన్నారు.