రూ.125కే విద్యుత్ కనెక్షన్
కర్నూలు (రాజ్‌విహార్) : కేంద్ర ప్రభుత్వ చేయూతతో రూ.2800 కోట్లు వెచ్చించి విద్యుదీకరణ పనులు చేపట్టనున్నట్లు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ హెచ్.వై. దొర తెలిపారు. శుక్రవారం కర్నూలులో ఆయన విలేకరుతో మాట్లాడారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన కింద తమ డిస్కం పరిధిలోని 8 జిల్లాల్లో (రాయలసీమ జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 3 లక్షల మందికి రూ.125 కే విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 500 వాట్స్ లోపు లోడు ఉన్న ఇంటికి తామే వైరింగ్ చేసి ఒక బల్బు ఇవ్వడంతోపాటు ఉచితంగా మీటర్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇది టెండరు దశలో ఉందన్నారు.