హుండీ ఆదాయం రూ.45 లక్షలు
అలంపూర్ : దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల హుండీ ఆదాయం రూ45 లక్షల 2 వేల 607 వచ్చినట్లు ఆలయ ఈఓ నరహరి గురురాజ తెలిపారు. కష్ణా పుష్కరాల అనంతరం ఆలయాల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బీ. కష్ణ, ఆలయ ఈఓ నరహరి గురురాజలు అర్చకులతో కలిసి ఆలయాల్లో హుండీ లెక్కింపు సందర్భంగా పూజలు నిర్వహించి హుండీ లెక్కింపును ప్రారంభించారు. సాయంత్రం వరకు కొనసాగిన లెక్కింపులో హుండీ ద్వార రూ.45 లక్షల 2 వేల 607 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోని మిగిలిన హుండీలను బుధవారం లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ మంజుల హుండీ లెక్కింపును సమీక్షించారు. సర్పంచ్ జయరాముడు, ఆలయ అధికారులు చంద్రయ్య ఆచారి, శ్రీను, రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు.
బీచుపల్లి హుండీ లెక్కింపు
ఇటిక్యాల : బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం పూర్తయింది. కష్ణా పుష్కరాల సందర్భంగా ఆలయ హుండీ ఆదాయం 21 లక్ష 62 వేల 593 రుపాయలు వచ్చినట్లు ఆలయ ఇఓ రామన్‌గౌడ్ తెలిపారు. రెండు రోజల నుంచి ఆలయ హుండీ లెక్కింపును గద్వాల్‌లోని ఆంధ్రబ్యాంక్ సిబ్బంది , శిష్యువుమందిర్ విద్యార్థులు ,భక్తులు దేవదయాశాఖ ,డివిజన్ ఇన్స్పెక్టర్ శకుంతల , పూజారులు ప్రహ్లాదశర్మ, మారుతిశర్మ,తదితరులు ఉన్నారు.