rtc development
-
ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం
యాదగిరిగుట్ట :ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని హైదరాబాద్ జోన్ సీఎంఈ ఎస్.రవీంద్రబాబు, నల్లగొండ రిజీనల్ ఆర్ఎం బత్తిని రవీం దర్ అన్నారు. ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నల్లగొండ రీజియన్ స్థాయిలో ప్రమాదరహిత డ్రైవర్లకు అవార్డులు అందించేందుకు శనివారం యాదగిరిగుట్ట డిపోలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులు ఆర్టీసీని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. అధికారులు, కార్మికుల మధ్య సమన్వయం ఉన్నప్పుడే తగిన ఫలితాలు సాధించగలమన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చి సంస్థకు తగిన పేరు, ఆదాయాన్ని తీసుకురావాల న్నారు. కేఎంపీఎల్, ఈపీకేలను సంస్థ సూచించిన లక్ష్యాల మేరకు సాధిం చేందుకు డ్రైవర్లు, కండక్లర్లు కృషి చేయాలన్నారు. ఇంధన పొదుపుపై తగిన శ్రద్ధ తీసుకుంటేనే సంస్థ పురోగతి సాధిస్తుందన్నారు. డ్రైవర్లు ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా నడపాలన్నారు. ఈ విషయంలో వారికి ఎప్పుటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గుట్ట డిపో ఎప్పుడూ లాభాల్లో ఉంటుందన్నారు. ఇందుకు ఇక్కడి అధికారులు , కార్మికుల కృషే కారణమన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఏడు డిపోల్లో ఎలాంటి ప్రమాదాలూ లేకుండా రికార్డు సాధించిన 21మంది డ్రైవర్లను ఉత్తమ డ్రైవర్లుగా గుర్తించి వారిని ఘనంగా సత్కరించారు. అవార్డులు అందించారు. కార్యక్రమంలో అధికారులు జాన్‌రెడ్డి, అనిల్‌కుమార్, డీఎం మద్దిలేటి, ఎస్ఐ నర్సింహరావు, పాల్, ఎన్. ఎల్లయ్య పాల్గొన్నారు. -
ఆర్టీసీ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
ఒంగోలు, న్యూస్‌లైన్: ఆర్టీసీ అభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి అన్నారు. స్థానిక ఒక లాడ్జిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ తీవ్ర సంక్షోభాన్ని చవిచూసిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీటుకు ఉన్న నామమాత్రపు టాక్స్‌ను 15 శాతం పెంచి ఆర్టీసీపై భారం మోపాడన్నారు. పెంచిన టాక్స్‌ను తగ్గించాలని 24 రోజులపాటు ఆర్టీసీలోని కార్మిక సంఘాలన్నీ సమ్మె చేస్తే కేవలం 2.5 శాతం టాక్స్ మాత్రమే తగ్గించారని విమర్శించారు. ఒకవైపు ప్రయాణికులపై చార్జీల రూపంలో భారం మోపుతూ ఆర్టీసీకి రావాల్సిన రాయితీలు ఒక్కపైసా కూడా చెల్లించకుండా మోకాలడ్డిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. తొమ్మిదేళ్లలో ఒక్క కాంట్రాక్ట్ డ్రైవర్నుగానీ, కండక్టర్నుగానీ పర్మినెంట్ చేయకుండా ఊడిగం చేయించుకున్నారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సుల్ని వాడుకుని నష్టాలకు పునాది వేశాడని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బకాయిలు 5 వేల కోట్లకు చంద్రబాబు విధానాలే కారణమన్నది ప్రతి కార్మికుడు గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచకుండానే సీటుకు ఉన్న టాక్స్‌ను 5 శాతం తగ్గించారని చెప్పారు. ప్రభుత్వ ఖజానా నుంచి సాలీనా రూ.250 కోట్ల ఆర్థిక సాయం అందించారని తెలిపారు. వైఎస్సార్ మొదటిసారిగా ప్రభుత్వ రాయితీలను రూ.220 కోట్లు ఆర్టీసీకి చెల్లించారని చెప్పారు. కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లను రెండు దఫాలు రెగ్యులర్ చేశారన్నారు. వైఎస్సార్ హయాంలో లాభాల బాటలో ఉన్న ఆర్టీసీ ఆయన మరణం తరువాత తిరిగి సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాలంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవడం ఒక్కటే మార్గమని అన్నారు. ఈనెల 7వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌గుర్తుపై ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు ఏ.భగవాన్, టీ.గోపాలరావు, బీ.పిచ్చిరెడ్డి, షేక్ భాషా, ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు.