ఇండియన్ ఐడల్ విజేత సందీప్ ఆచార్య కన్నుమూత
ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజేత సందీప్ ఆచార్య (29) మరణించాడు. పచ్చకామెర్ల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై అతడు ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కన్నుమూశాడు. గుర్గావ్ లోని మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఫలితం లేకపోయింది.
బికనీర్లో ఓ పెళ్లికి హాజరైనప్పుడు ఆచార్య ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది. దాంతో అతడి బంధువులు వెంటనే మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. పచ్చకామెర్ల వల్లే ఇతర అనారోగ్యాలు కూడా తీవ్రంగా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. సందీప్ ఆచార్య మృతిపట్ల పలువురు ప్రముఖ గాయకులు సంతాపం తెలిపారు. గాయకులు శ్రేయా ఘోషల్, సోను నిగమ్ తదితరులు ట్విటర్ ద్వారా తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆచార్యకు భార్య, ఒక నెల వయసున్న కుమార్తె ఉన్నారు.
Just heard abt Indian Idol Sandeep Acharya.. Shocked. Too young, and a wonderful guy.. I still hope this news is untrue..
— Shreya Ghoshal (@shreyaghoshal) December 15, 2013
Sandeep Acharya died? Oh my God.. his Wikipedia has been modified 15 minutes back... any1 knows how? I'm so so sad. Wht a btful soul.
— Sonu Nigam (@sonuniigaam) December 15, 2013