సహజీవనంలో అత్యాచారం
బనశంకరి (బెంగళూరు): సహజీవనం చేస్తుండగా, తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక మహిళ(39) శనివారం బెంగళూరు సంజయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ఇక్కడే ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రదీప్ కుమార్ అభిరామ్ అనే వ్యక్తి బెంగళూరులోనే ఉంటాడు. అతనితో 2010 నుంచి పరిచయమని, ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. సహజీవనం చేస్తున్న సమయంలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పెళ్లి చేసుకోమని అడిగితే ఏకాంతంగా గడిపిన వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. కులం పేరుతోనూ దూషించాడని వాపోయింది. పలువురు మహిళలను బెదిరించి సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించారు. ప్రదీప్ కుమార్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.