sankar sing
-
మహిళలు చెప్పుతో కొట్టింది నన్ను కాదు
-
మహిళలు చెప్పుతో కొట్టింది నన్ను కాదు
హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్ పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేను ఇద్దరు మహిళలు చెప్పుతో కొట్టారంటూ... ఫేస్బుక్లో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొట్టింది. 32 సెకన్ల నిడివి గల దీనికి సంబంధించిన వీడియో ఫేస్బుక్లో 5000 సార్లకు పైగా షేర్ కూడా అయింది. మధ్యప్రదేశ్‌లోని కైలారస్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర శుక్లా ఈ వీడియోను షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో చెప్పినట్టు బీజేపీ ఎమ్మెల్యే కాకుండా.. హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడు ఈ చెప్పు దెబ్బలు తిన్నారు. వీడియోలో ఒక మహిళా.. సన్మాన కార్యక్రమంలో ఓ వ్యక్తికి దండ వేస్తూ ఉండగా... మరో మహిళ తన చెప్పు తీసుకొని అతన్ని కొడుతూ ఉంటుంది. ఈ వీడియోలో వెనుక కనిపిస్తున్న పోస్టర్లో ‘హిమాచల్ పరివాహన్ మజ్దూర్ సంఘ్’ అని ఉంది. అయితే హమీర్ పూర్‌కు చెందిన సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే నరిందర్ థాకూర్‌ను సంప్రదించగా.. తనకు అలాంటి అవమానకర సంఘటన ఎదురు కాలేదని చెప్పారు. కానీ హమీర్ పూర్లో ఆ సంఘటన జరిగిందన్నారు. హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడిపై ఈ దాడి జరిగిందని, మహిళలు కొట్టింది తనని కాదని చెప్పేశారు. 2018 జూలై 22న ఇద్దరు ట్రైనీ మహిళా కండక్టర్లు అతనిపై ఈ దాడికి పాల్పడట్టు తెలిసింది. ఆ తర్వాత వారిద్దర్ని వారి వారి ఉద్యోగాల నుంచి తొలగించినట్టు కూడా రిపోర్టుల వచ్చాయి. ఇదే విషయాన్ని హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడు శంకర్ సింగ్ కూడా ధృవీకరించారు. 2018 జూన్ 22న కొంతమంది మహిళలు తనపై దాడి చేశారని, సన్మాన కార్యక్రమంలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు మహిళా కండక్టర్లు తనను ఈ విధంగా చెప్పుతో కొట్టారని చెప్పారు. వారికి కార్పొరేషన్లో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వలేదని ఈ సంఘటనకు పాల్పడ్డారని తెలిపారు. అయితే మీకు బీజేపీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు, తాను ఓ ఆర్ఎస్ఎస్ వర్కర్‌ను అని, తనకు బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. అయితే ఫేస్బుక్లో షేర్ అవుతున్నట్టు బీజేపీ హమీర్పూర్ ఎమ్మెల్యేపై ఆ ఈవెంట్లో ఎలాంటి దాడి జరగలేదని, ఈ అవమానకర సంఘటనను హిమాచల్ రోడ్డు రహదారుల కార్పొరేషన్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ శంకర్ సింగ్ ఈ దాడికి గురయ్యారని చెప్పారు. -
గుడుంబా 'శంకర్‌సింగ్' అరెస్టు
గచ్చిబౌలి (హైదరాబాద్): గుడుంబా అక్రమ తయారీ, విక్రయాలతో కొరకరాని కొయ్యగా మారిన శంకర్‌సింగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలి సీఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నానక్‌రాంగూడకు చెందిన నింబా శంకర్ సింగ్ (35) కొన్నేళ్లుగా తన నివాసం సమీపంలోనే గుడుంబా తయారు చేస్తూ ఖానామెట్, చందానాయక్ నగర్ తండా, ఇజ్జత్ నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం ఇంటి వద్దనే అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి అరకిలో గంజాయి, వంద గుడుంబా పాకెట్లు, వంద పాలీథిన్ కవర్లు, రెండు సంచుల నల్లబెల్లం, 30 కిలోల చక్కెర, రెండు డ్రమ్ములు, పైపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో గతంలో రాయదుర్గం పోలీసులు రిమాండ్‌కు పంపించారు.మొత్తం 83 కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు.