అథ్లెట్లకు అదే నిరాశ
రియో: ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు దారుణంగా విఫలమయ్యారు. తమ విభాగాల్లో కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. పురుషుల రేస్ వాక్‌లో భారత జట్టు (మహ్మద్ పుథన్ పురక్కల్, మహ్మద్ అనాస్, అయ్యసామి ధరున్, రాజీవ్ అరోకియా) తప్పుడు టేక్ఓవర్ కారణంగా అర్హత కోల్పోయారు. పురుషుల 4ఁ400 మీటర్ల రిలేలో భారత జట్టు అర్హత కోల్పోగా.. మహిళల 4*400 రిలేలో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరటంలో విఫలమయింది. ఎనిమిది జట్లున్న హీట్స్ (రెండో)లో భారత మహిళల రిలో జట్టు (నిర్మల షేరాన్, టింటు లూకా, ఎమ్మార్ పూవమ్మ, అనిడ్ల థామస్) 29.33 సెకన్లలో రేసు పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచింది.
20 కిలోమీటర్ల నడకలో అథ్లెట్ సప్నా పునియా కూడా అర్హత సాధించలేకపోయింది. రేసులో 8 కిలోమీటర్లు పూర్తయ్యాక సప్నా స్వచ్ఛందంగా తప్పుకుంది. దీనికి కారణం తెలియరాలేదు. ఖుష్బిర్ కౌర్ 1.40.33 గంటల్లో రేసు పూర్తిచేసి 54వ స్థానంలో నిలిచింది. పురుషుల 50 కిలోమీటర్ల నడకను సందీప్ కుమార్ (హరియాణాకు చెందిన ఆర్మీ ఉద్యోగి) 4.07.55 గంటల్లో పూర్తి చేసి 35వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ విభాగంలో బంగారుపతక విజేత మతేజ్ తోహ్ కన్నా 26.57 నిమిషాలు వెనకబడ్డాడు. ఖుష్బీర్, సందీప్ కుమార్ తమ అత్యుత్తమ ప్రతిభకన్నా ఎక్కువసమయం తీసుకున్నారు.