sarogasi father
-
కవలలతో ఇంటికి స్టార్ డైరెక్టర్
ముంబయి: ఇటీవలే సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవలలకు తండ్రి అయిన బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ బుధవారం తమ చిన్నారులను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకు వెళ్లాడు. కూతురు రూహి, కొడుకు యాష్లను కరణ్ ఇంటికి తీసుకువెళుతున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతున్నాయి. కరణ్ చిన్నారిని ఎత్తుకుని సూర్యా ఆస్పత్రి లోపల నుంచి కారు వద్దకు వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే చిన్నారుల మొహాలు మాత్రం కెమెరాకు చిక్కలేదు. నెలలు నిండకుండానే పుట్టడంతో కవలలను ఏడు వారాల పాటు ఎన్ఐసీయూలో ఉంచారు. ఆస్పత్రి డైరెక్టర్ భూపేంద్ర అవస్థి ఆ చిన్నారులిద్దరి ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా రూహి, యాష్లను ఫిబ్రవరి 7న ఆస్పత్రిలో చేర్పించారని, వారిని ఆస్పత్రిలో చేర్చించి 50 రోజులు పూర్తయిందని, కవలల ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకు వెళుతున్నట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో కవలలు పుట్టినప్పటికీ ఆ విషయాన్ని కరణ్ ఈ నెల 5న ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. మానసికంగా, భౌతికంగా, భావోద్వేగంతో కూడిన ప్రేమను తన బిడ్డలకు పంచేందుకు సిద్ధమైనట్లు అతడు తెలిపాడు. -
సరోగసీ తండ్రి.. కరణ్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సరోగసీ ద్వారా కవలలకు తండ్రి (సింగిల్ ఫాదర్) అయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటనలో 44 ఏళ్ల కరణ్ ప్రకటించారు. తన తల్లిదండ్రుల పేర్లు కలసివచ్చేట్లుగా కూతురుకు రూహి, కొడుకుకు యష్ పేర్లు పెట్టారు. కరణ్ తండ్రి కావడంపై బాలీ వుడ్ తారలు వివిధ సామాజిక మాధ్య మాల ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలా ఉద్వేగంగా ఉందని, తండ్రిగా నా బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటనలో కరణ్ పేర్కొన్నారు. మానసికంగా, భౌతికంగా, భావోద్వేగంతో కూడిన ప్రేమను తన బిడ్డలకు పంచేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. పిల్లలే తన ప్రపంచమని, ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇక నుంచి సినిమాలు, ప్రయాణాలు, ఒప్పందాలన్ని పిల్లల తర్వాతేనని కరణ్ జోహార్ వెల్లడించారు. సరోగసీలో శిశువులకు జన్మనిచ్చిన మహిళకు కరణ్ కృత జ్ఞతలు తెలిపారు. తన జీవితకాల కలను ఆమె నెరవేర్చారన్నారు. దేవుడి దయ వల్ల గొప్ప తల్లిని పొందానని, ఇప్పుడామె మనవడు, మనవరాలి ఆలనాపాలనలో ముఖ్యపాత్ర పోషిస్తుం దన్నారు.