ఆ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కే
* 5గురు ఐఏఎస్‌లు, 12 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేసిన టీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐదుగురు ఐఏఎస్‌లు, 12 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారుల్లో నీరబ్‌కుమార్ ప్రసాద్, ఐ.శ్రీనివాస్ శ్రీ నరేశ్, గిరిజా శంకర్, హరి జవహర్లాల్, లక్ష్మీకాంతం ఉన్నారు.
ఐపీఎస్ అధికారుల్లో కసిరెడ్డి వీఆర్ఎన్ రెడ్డి, డాక్టర్ ఎం.కాంతారావు, నాగేంద్రకుమార్, కాంతిరాణా టాటా, శ్యాంసుందర్, సర్వశ్రేష్ట త్రిపాఠీ, ఆర్.రాజ్యలక్ష్మి, డాక్టర్ గజరావు భూపాల్, కె.కోటేశ్వరరావు, ఎల్‌కేవీ రంగారావు, జి.పాలరాజు, కె.ఫకీరప్ప ఉన్నారు. బుధవారం మిగిలిన అధికారులందర్నీ ప్రభుత్వం రిలీవ్ చేయనున్నట్లు సమాచారం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్‌లపై సీఎం కేసీఆర్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మతో సమాలోచనలు చేశారు.
తెలంగాణకు కేటాయించిన అధికారులను ఏపీ ప్రభుత్వం జనవరి ఒకటి తర్వాత రిలీవ్ చేయనున్నట్లు సమాచారం. కాగా, కోలిండియా సీఎండీగా ఎంపికైన సుతీర్థ భట్టాచార్యను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరో ఉత్తర్వు జారీ చేశారు. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు విభజిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌కు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.