రాజ్యాంగంపై విశ్వాసానికి ఈ ఉత్తర్వులు ప్రతీక
రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్
హైదరాబాద్: రోజాపై ఏడాది పాటు సస్పెన్సన్ వేటు వేస్తూ చేసిన తీర్మానం అమలును నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆమెతరపు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా రోజా రాజ్యాంగపరమైన హక్కులు పునరుద్ధరించబడ్డాయని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగంపై విశ్వాసానికి ఈ ఉత్తర్వులు ప్రతీక అన్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయం చేసేందుకు న్యాయస్థానాలు ఉన్నాయన్న ప్రజల నమ్మకాన్ని ఇటువంటి ఉత్తర్వులు నిలబెడతాయన్నారు. ఇవి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని వీటిపై ఇంతకుమించి తానేమీ వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల రోజా శాసనసభకు హాజరు కావచ్చునని తెలిపారు.