తెల్లజుట్టు ఉంటే హృద్రోగ ముప్పు!
లండన్: తెల్లజుట్టు ఉన్న పురు షులకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. అథెరోస్లె్క రోసిస్(రక్తనాళాలు బిరుసెక్క డం), జుట్టు తెల్లబడటంల మధ్య కొన్ని పోలికలు ఉన్నట్లు ఈజిప్టు లోని కైరో వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. 545 మంది పురుషులపై వీరు పరిశోధన సాగించి ఈ విషయం తేల్చారు.
వయసుతో సంబంధం లేకుండా, తెల్లజుట్టు ఎక్కు వగా ఉన్నవారికి హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువనీ, తెల్లజుట్టు తక్కు వ ఉంటే ముప్పు తక్కువని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ‘అథెరోస్లె్కరోసిస్, జుట్టు తెల్లబడటం.. ఇవి వచ్చినప్పుడు శరీరంలో ఒకేరకమైన మార్పులు కలుగుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ వీటి సమస్యా అధికమవుతుంది’ అనే శామ్యూల్ అనే వైద్యుడు చెప్పారు.