కెయిర్న్ ఇండియూకు భద్రతా అవార్డు
ఉప్పలగుప్తం : కెయిర్న్ ఇండియాకు భారత ప్రభుత్వం నుంచి భద్రతా అవార్డు లభించిందని జనరల్ మేనేజర్ జాకబ్ మేథ్యూ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ద్వారా గనుల విభాగంలో 2011-12 ఏడాదికి లభించిన జాతీయ భద్రతా అవార్డును న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రదానం చేశారని వెల్లడించారు.
వ్యాపార దృక్పథమే కాక కార్మిక సంక్షేమం కోసం కెయిర్న్ చేస్తున్న కృషిని, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతి ప్రశంసించారని తెలిపారు. కేజీ బేసిన్ రవ్వ క్షేత్రంలో కెయిర్న్ ఇండియా చమురు సహజవాయు నిక్షేపాలు వెలికితీస్తోంది. ఆన్షోర్, ఆఫ్షోర్ ప్లాంట్లలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తోందని జాకబ్ పేర్కొన్నారు.