అమర పోలీసులకు సెల్యూట్..!
ఆత్మకూరు(ఎం) పోలీస్‌స్టేషన్‌పై మావోయిస్టుల దాడి జరిగి నేటితో పదేళ్లు
ఆత్మకూరు(ఎం) : సరిగ్గా పదేళ్ల క్రితం.. జనమంతా.. రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయం..అప్పుడే పిడుగుపడినట్టుగా పెద్ద శబ్దం వినిపించింది. జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమిటా అని లేచి బజార్లకు వచ్చేలోపే పోలీస్‌స్టేషన్‌పై బాంబులతో దాడి జరిగిందనే వార్త దాహనంలా వ్యాపించింది. అదే ఆత్మకూర్(ఎం)మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌పై మావోయిస్టుల జరిపిన బాంబుదాడి ఘటన. ఈ దాడి జరిగి గురువారంతో పదేళ్లయ్యింది. దశాబ్దం క్రితం ఇదేరోజు అర్ధరాత్రి (18–08–2006న) జరిగిన దాడిలో అప్పటి స్టేషన్ ఎస్ఐ చాంద్ పాషా, ఏఎస్ఐ సుల్తాన్‌మొయినో ద్దీన్, హోంగార్డు లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మావోయిస్టుల దాడిలో ప్రాణాలొదిలిన అమరపోలీసుల త్యాగాన్ని స్మరించుకుందాం. వారి మతికి నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుదాం..
క్షణక్షణం.. భయంభయం !
వర్కట్‌పల్లి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మండల కేంద్రంలో 1993–94లో అప్పటి ఎంపీపీ పి.హేమలత ఇంటిని నక్సలైట్లు పేల్చివేశారు. అప్పటి నుంచి ఎటువంటి సంఘటనలు ఆత్మకూరు(ఎం)లో చోటు చేసుకోలేదు. ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న ఆత్మకూరు(ఎం)లో మరలా 2006లో అలజడి మెుదలైంది. పోలీస్‌స్టేషన్‌పై మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఎస్ఐ, ఏఎస్ఐ, హోంగార్డుల మతి చెందగా జనం క్షణక్షణం భయపడుతున్నారు. అలాగే ఏడాదిన్న క్రితం జానకిపురంలో ఉగ్రవాదుల కాల్పులకు మతి చెందిన ఎస్ఐ డి.సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు మరణాలను ఇప్పటికీ ఈ మండల ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.