ఫైనల్లో శశిధర్
జింఖానా, న్యూస్‌లైన్: వశిష్ట ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బాలుర అండర్-10 విభాగంలో శశిధర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. సైనిక్‌పురిలోని కార్నివాల్ క్లబ్లో గురువారం జరిగిన సెమీఫైనల్లో శశిధర్ 6-2తో యువరాజ్‌పై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. తనతో పాటు యశ్వంత్ 6-3తో ఆశిష్‌పై నెగ్గాడు. బాలుర అండర్-12 విభాగం క్వార్టర్ఫైనల్లో రాహుల్ 6-0తో కౌషిక్ కుమార్‌పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. శశిధర్ 6-2తో సయ్యద్ ఖాసిమ్ అలీపై, బ్రిహత్ 6-1తో యువరాజ్‌పై, షేక్ రెహాన్ 6-4తో వంశీకృష్ణా రెడ్డిపై గెలుపొందారు. ఇతర ఫలితాలు.
బాలుర అండర్-8 సెమీఫైనల్: రోహిత్ సాయి చరణ్ 5-1తో నిఖిల్ స్వాతి ప్రసాద్‌పై, చాణక్యపై పూర్వా పారిఖ్ (వాకోవర్ ద్వారా) నెగ్గారు.
అండర్-14 మూడో రౌండ్: ఉద్ధవ్ ఠాకూర్ 6-0తో ఐ. నిఖిల్‌పై, మోహిత్ సాయి కుమార్ 7-5తో అల్లాన్పై, రాహుల్ 6-0తో కపిల్‌పై, ఆదిత్య 6-3తో బ్రిహత్పై, యశోధన్ 6-2తో రేవంత్‌పై, కుషాల్ 6-5తో పి.నిఖిల్‌పై, అఖిలేశ్ రెడ్డి 6-2తో అర్చిత్‌పై, అభిషేక్ 6-5తో ఆయుష్‌పై నెగ్గారు.
బాలికల అండర్-8 ఫైనల్స్: దియా రెడ్డి 7-4తో అపూర్వపై విజయం సాధించింది.
అండర్-10 సెమీఫైనల్: అదితి 6-2తో రక్షితపై, షేక్ కామ్రీన్ 6-0తో విదితపై గెలిచారు.
అండర్-12 క్వార్టర్ ఫైనల్ : సృజన 6-2తో ఏంజెలా రాచెల్పై, అమూల్య 6-5తో శ్రీహర్షితపై, విదూషి 6-1తో రితికా రెడ్డిపై, నిఖిత 6-1తో సంజనపై గెలుపొందారు.
అండర్-14 సెమీఫైనల్: ఎస్. నిఖిత 6-5తో శ్రీహర్షితపై, టి.నిఖిత 6-4తో రితికపై నెగ్గారు.