రెండో సంతానానికి చైనా అంగీకారం!
బీజింగ్: చైనాలో రెండో సంతానం కల్గి ఉండటానికి అక్కడి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనికి గాను బీజింగ్ లోని 20,000 మంది చైనా జంటలకు అనుమతినిచ్చింది. గతంలో ఉన్న ఏక శిశు విధానాన్ని ఫిబ్రవరిలో సడలించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. దేశంలోని జనాభాలో భారీ స్థాయిలో సమతుల్యత దెబ్బతినడంతో రెండో సంతానానికి మార్గం సుగుమం చేసింది. ఇందుకు బీజింగ్ నగరంలో 21, 249 మంది జంటలు రెండో సంతానానికి దాఖలు చేసుకోగా, 19, 363 మంది జంటలకు అనుమతి లభించింది. ఈ రకంగా అనుమతి లభించిన వారిలో 56 శాతం మంది మహిళలు 31 నుంచి 35 ఏళ్ల లోపు వారే.
జనాభా పెరుగుదల రేటును నియంత్రించేందుకు చైనా ప్రవేశపెట్టిన ఏక శిశు విధానాన్నిదశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే దేశంలోని తరాల మధ్య పెరుగుతున్న భారీ వ్యత్యాసాన్ని నివారించేందుకు ఈ తాజా విధానం ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది.