కేంద్ర కార్మిక మంత్రి శీష్ రామ్ కన్నుమూత
గుర్గావ్: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి శీష్ రామ్ ఓలా(86) ఈ ఉదయం కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మేదాంత మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
జాట్ సామాజిక వర్గానికి చెందిన శీష్ రామ్... రాజస్థాన్లోని జున్జును నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1957 నుంచి 199౦ వరకు రాజస్థాన్ శాసనసభ్యుడిగా ఉన్నారు. 1980 నుంచి 1990 వరకు రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. శీష్ రామ్ తనయుడు బిజేందర్ ఓలా.. జున్జును ఎమ్మెల్యేగా ఉన్నారు.