Skating
-
టోక్యో : ఫిగర్ స్కేటింగ్.. అద్భుత విన్యాసాలు (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ స్కేటర్ జెస్సీకి పసిడి పతకం
సాక్షి, విజయవాడ: వరల్డ్ స్కేట్ ఓసియానియా ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో భాగంగా పసిఫిక్ కప్ ఓపెన్ టోరీ్నలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మాత్రపు జెస్సీ రాజ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ టోరీ్నలో విజయవాడకు చెందిన 13 ఏళ్ల జెస్సీ ఇన్లైన్ ఫ్రీ స్కేటింగ్ లేడీస్ క్యాడెట్ విభాగంలో విజేతగా నిలిచింది. తన స్కేటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న జెస్సీ మొత్తం 31.98 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాలుగేళ్ల క్రితం స్కేటింగ్ లో అడుగు పెట్టిన జెస్సీ జాతీయస్థాయి పోటీల్లో ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్యాలు గెలిచింది. -
చైనా చిలుక.. స్కేటింగ్ చేస్తుందోయ్.!
-
ఔరా.. ప్రపంచ రికార్డు కోసం బాలుడి స్కేటింగ్ యాత్ర
సాక్షి, తిరుపతి: ప్రపంచ రికార్డు కోసం ఎనిమిదేళ్ల బాలుడు స్కేటింగ్ యాత్ర చేస్తున్నాడు. ఏర్పేడుకు చెందిన వేదనరసింహ సోమవారం ఉదయం ఏర్పేడు నుంచి రోలర్ స్కేటింగ్ యాత్ర ప్రారంభించాడు. వెంకటగిరి, రాపూరు, పెంచలకోన, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, నెల్లూరు, గూడూరు మీదుగా మొత్తం 270 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. సోమవారం మధ్యాహ్నానికి కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చేరుకుంది. ఉయ్యాలపల్లి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వేదనరసింహకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలుడి కోచ్ ప్రతాప్ వివరాలు వెల్లడిస్తూ.. ఇప్పటి వరకు కర్ణాటకకు చెందిన వెన్సికసిరి అనే ఎనిమిదేళ్ల బాలిక 2022 ఫిబ్రవరిలో 250 కి.మీ. నాన్‌స్టాప్ సోలో స్కేటింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించిందని, ఆ రికార్డును అధిగమించేందుకు వేదనరసింహ 270 కి.మీ స్కేటింగ్ యాత్ర చేస్తున్నట్టు చెప్పారు. చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు! -
'స్లమ్‌డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్
జార్జియాకు చెందిన అనస్తాసియా గుబనోవా యూరోపియన్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్(EURO 2023) విజేతగా నిలిచింది. అయితే ఆమె బ్లాక్బాస్టర్ సినిమా.. ఆస్కార్ విజేత స్లమ్‌డాగ్ మిలియనీర్ మ్యూజిక్‌తో దాదాపు నాలుగు నిమిషాల 30 సెకన్ల పాటు స్కేటింగ్ చేయడం విశేషం. మధ్యలో బాలీవుడ్ సినిమా గలియోంకీ రాస్లీలా రామ్లీలాలోని సూపర్‌హిట్ సాంగ్ డోల్ బాజే పాట కూడా వినిపించడం విశేషం. భారతీయ సంప్రదాయమైన చీరకట్టుతో అనస్తాసియా గుబనోవా స్కేటింగ్ చేస్తూ అందరి ప్రశంసలను అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక అనస్తాసియా గుబనోవా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో 11వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే శనివారం జరిగిన యూరో స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో 199.1 పాయింట్లు సాధించి తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ అందుకుంది. ఇక బెల్జియంకు చెందిన లియోనా హెండ్రిక్స్ 193.2 పాయింట్లో రెండో స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కిమ్మి 192.5 పాయింట్లతో కాంస్యం సాధించింది. ⛸️Avrupa Artistik Patinaj Şampiyonası'nda kadınlarda altın madalya aşağıdaki enerjik ve harika serbest program performansıyla Anastasiia Gubanova'ya gitti. Kısa programı da zirvede tamamlayan Gubanova kariyerinin ilk Avrupa Şampiyonluğu'nu yaşadı. #EuroFigure pic.twitter.com/LlJCtc2SWu — Murat Taşkolu (@murattaskolu) January 28, 2023 చదవండి: ఎగతాళి చేసిన గడ్డపైనే చప్పట్లు కొట్టించుకుంది -
Bheemili: అన్న.. చెల్లి.. అదుర్స్ .. జాతీయ స్థాయిలో పతకాల పంట
కొమ్మాది(భీమిలి)/ విశాఖపట్నం: పోటీకి దిగితే ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించి పతకం సాధించడమే వారి లక్ష్యం. విజయం సాధించాలనే పట్టుదలకు నైపుణ్యం తోడవడంతో స్కేటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఎండాడకు చెందిన అన్నా చెల్లెలు బొల్లాప్రగడ శ్రీ సాకేత్, శ్రీ సాహితి. రింక్‌లో అద్భుత ప్రదర్శన సాగిస్తూ.. జాతీయస్థాయిలో పతకాలు సొంతం చేసుకుంటున్నారు. అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. ఎండాడ స్కైలైన్‌లో నివాసం ఉంటున్న బొల్లా ప్రగడ ప్రభాకర్, మాధురి దంపతుల సంతానమే ఈ చిచ్చర పిడుగులు. ఆరేళ్ల ప్రాయంలోనే శ్రీ సాకేత్ స్కేటింగ్‌లో ప్రతిభ కనపరిచాడు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతూ.. మరో వైపు స్కేటింగ్‌లో రాణిస్తూ అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నాడు. అన్న స్ఫూర్తితోనే చెల్లి కూడా స్కేటింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. నాలుగేళ్ల ప్రాయంలోనే ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో ప్రవేశం పొందిన శ్రీ సాహితి.. శివాజీ పార్కులోని స్కేటింగ్ రింక్‌లో కోచ్‌లు సత్యం, చిట్టిబాబు వద్ద శిక్షణ తీసుకుంది. ఏడాదిలోనే నైపుణ్యం సాధించి జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పతకాలు సాధించింది. శ్రీ సాకేత్ సాధించిన పతకాలివీ.. శ్రీ సాకేత్ జాతీయస్థాయిలో 7, రాష్ట్రస్థాయిలో 14 పతకాలతో పాటు జిల్లాస్థాయిలో 14 పతకాలు సాధించాడు. ఇందులో 17 బంగారు, 16 వెండి, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇన్లైన్ స్కేటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 9వ తరగతి చదువుతున్న శ్రీ సాకేత్, 7వ తరగతి చదువుతున్న శ్రీ సాహితి చదువులోనూ రాణిస్తున్నారు. జాతీయస్థాయి పోటీల్లో అత్యధిక పతకాలు సాధించడంతో పలువురు అభినందిస్తున్నారు. శ్రీ సాహితి ప్రతిభ ఇదీ.. శ్రీ సాహితి జాతీయస్థాయిలో 18, రాష్ట్రస్థాయిలో 24, జిల్లాస్థాయిలో 33 పతకాలు కైవసం చేసుకుంది. ఇందులో 41 బంగారం, 31 వెండి, 3 కాంస్యం పతకాలు ఉన్నాయి. శాప్ నిర్వహించిన పోటీల్లో 6 పతకాలను సొంతం చేసుకోవడంతో పాటు విశాఖ, చంఢీగర్, పంజాబ్‌లోని మొహలీలో జరిగిన 57, 58, 59వ జాతీయ స్థాయి పోటీల్లో 9 బంగారు, 9 వెండి పతకాలు సాధించింది. అంతర్జాతీయ పోటీలకు ముమ్మర సాధన ఇటీవల జరిగిన జాతీయ రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ శిక్షణ శిబిరంలో అంతర్జాతీయ కోచ్ మార్క్ టోనీ వద్ద క్రీడా మెళకువలు నేర్చుకున్నారు. అతి త్వరలో జరగబోయే అంతర్జాతీయ క్రీడాపోటీల్లో దేశం తరఫున పతకం సాధించాలనే లక్ష్యంతో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు శిక్షణ పొందుతున్నాం. పోటీల్లో పాల్గొంటూ విజయాలు సాధిస్తున్నామంటే.. దీని వెనుక మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది. చదువుకుంటూ అంతర్జాతీయ క్రీడా పోటీలకు సిద్ధమవుతున్నాం. కచ్చితంగా పతకాలు సాధించి విశాఖ జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తాం. – శ్రీ సాకేత్, శ్రీ సాహితి -
77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!
77 year Old Astrophysicist Battling Stage 4 Prostate Nails Ice Skating: మనషి ఎప్పుడూ నిత్య విద్యార్థిలా చివరి దశ వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆచరణ వరకు వస్తే అంతగా ఎవరూ పూర్తి స్థాయిలో చేయడానికి ఆసక్తి చూపరనే చెప్పాలి. ఏదో ఒక కారణంతో మన కలలను, లక్ష్యాలను వదిలేసి మనం ఇంతవరకే సాధించగలం అని సరిపెట్టేసుకుంటారు. కానీ ఇక్కడొక వృద్ధుడు మరణానికి దగ్గరలో ఉన్నా కూడా ఐస్ స్కేటింగ్ చేయాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. అసలు విషయంలోకెళ్లితే...రిచర్డ్ ఎప్స్టీన్ అనే 77 ఏళ్ల వృద్ధుడు రెండేళ్లకు పైగా క్రానిక్ లింఫాటిక్ లుకేమియా (సిఎల్‌ఎల్)తో పోరాడి బయట పడిన తర్వాత మళ్లీ 2020లో స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్ భారిన పడతాడు. అయితే అవేమి ఆ వృద్ధడు పెద్దగా పట్టించకోడు. పైగా ఐస్ స్కేటింట్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు దీని కోసం ఒక స్కేటింగ్ టీచర్ వద్ద ట్రైయినింగ్ కూడా తీసుకుంటాడు. ఈ మేరకు అతని కూతురు మహిళ రెబెకా బాస్టియన్ తన తండ్రి విజయవంతంగా ఐస్ స్కేటింగ్ నేర్చుకోవడమే కాక గురువుతో కలిసి స్కేటింగ్ చేస్తున్న వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు తన తండ్రి ఖగోళ శాస్త్రవేత్త అని మౌంట్ రైనర్‌ను అధిరోహించిన సాహసి అని కూడా వెల్లడిస్తుంది. పైగా నేర్చకునే వయసు అయిపోయింది, నా పరిస్థితి ఏం బాగోలేదు అని కూర్చోకూడదని కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ జీవితాన్ని ఆస్వాదించాలంటూ ట్విట్టర్లో పేర్కొంటుంది. అయితే ప్రసుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. My father is 77 years old and has stage 4 prostate cancer. He decided to learn how to ice skate a few years ago, and just did this performance with his teacher. For anyone that thinks it’s too late to try something new… ❤️ pic.twitter.com/0SZ3FmbNGE — Rebekah Bastian (@rebekah_bastian) December 9, 2021 -
ఏడేళ్ల వయస్సులో ప్రపంచ రికార్డు సొంతం
తణుకు(ప.గో జిల్లా) : చిన్నారి వయస్సు కేవలం ఏడేళ్లు... అయితేనేం వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. తణుకు పట్టణానికి చెందిన చిన్నారి వేగేశ్న జ్యోత్స్న సాత్విక ఫైర్ విత్ బ్లేడ్ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. వజ్ర వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సాహసోపేతమైన ప్రదర్శనలో జ్యోత్స్న సాత్విక విజయం సాధించింది. 26 మీటర్లు పొడవునా 8 అంగుళాల ఎత్తులో స్టాండ్స్, బ్లేడ్స్ ఏర్పాటు చేసి మంటల కింద నుంచి నిర్వహించిన ప్రదర్శనలో చిన్నారి విజయం సాధించి ఫైర్ విత్ బ్లేడ్ లింబో స్కేటింగ్ వజ్ర వరల్డ్ రికార్డ్స్ సీఈవో తిరుపతిరావు, కిడ్స్ వరల్డ్ రికార్డ్స్ సీఈవో అరుణ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్ ప్రతాప్‌లు చేతుల మీదుగా అవార్డులు అందుకుంది. స్కేటింగ్‌పై ఆసక్తితో... అయిదేళ్ల వయస్సు నుంచి చిన్నారి జ్యోత్స్న సాత్వికకు స్కేటింగ్‌పై మక్కువ. సాత్విక తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు స్కూలులో మూడో తరగతి చదువుతోంది. ఆమెలోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు స్కేటింగ్ కోచ్ లావణ్య వద్ద శిక్షణ నిమిత్తం చేర్పించారు. తండ్రి ఫణికుమార్ వ్యవసాయం చేస్తుండగా తల్లి మోహననాగసత్యవేణి గృహిణి. తల్లిదండ్రులు చిన్నారిని నిత్యం చదువుతోపాటు స్కేటింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రోత్సహిస్తున్నారు. సుమారు ఏడాదిన్నరపాటు శిక్షణ తీసుకుని అనంతరం కోవిడ్ కారణంగా నిలిపివేసింది. అనంతరం ఇటీవల మూడు నెలలుగా కఠోర శిక్షణ తీసుకున్న చిన్నారి ఫైర్ విత్ బ్లేడ్ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు కైవసం చేసుకుంది. స్కేటింగ్‌లో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా భవిష్యత్తులో వినూత్నంగా చేసి ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని చిన్నారి సాత్విక చెబుతోంది. -
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.. అనే దాన్ని నిజం చేసింది
సాక్షి,శేరిలింగంపల్లి(హైదరాబాద్): ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’అనే దాన్ని నిజం చేస్తోందీ చిన్నారి. ప్రాథమిక విద్యనభ్యసిస్తూనే జిల్లా, రాష్ట్ర స్థాయి దాటి జాతీయస్థాయిలో సత్తా చాటింది. నాలుగేళ్ల వయస్సులోనే చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ఆ చిన్నారి అద్వితీయ ప్రతిభతో జాతీయ స్థాయిలో జరిగిన అనేక పోటీల్లో పాల్గొని పలు పతాకాలను కైవసం చేసుకొని అప్రతిహతంగా ముందుకు సాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది చిన్నారి సాయివర్షితా రెడ్డి. ► శేరిలింగంపల్లిలో నివాసముండే కిరణ్‌కుమార్ రెడ్డి, సంతోషి దంపతుల కుమార్తె ఎంచల సాయివర్షిత రెడ్డి. నాలుగేళ్ల వయస్సు నుంచే ఆమెకు స్కేటింగ్‌పై ఉన్న మక్కువను తల్లిదండ్రులు గమనించారు. అనంతరం స్కేట్–9 అకాడమిలో కోచ్ విఠలా ఉప్పలూరి ఆధ్వర్యంలో స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించారు. మదీనాగూడలోని జెనిసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ తరగతి చదువుతూనే రాష్ట్ర, జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటూ అనేక విజయాలు సొంతం చేసుకొని పలువురి మన్ననలను పొందుతోంది. సాధించిన పతకాలు ► 2017లో రోలర్ స్కేటింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పథకం ► 2018లో అండర్ 8 విభాగంలో రోలర్ స్కేటింగ్ రాష్ట్ర స్థాయిలో కాంస్య పథకం ► 2019లో అండర్ 9 విభాగంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నోయిడాలో జరిగిన పోటీల్లో 500, 300 మీటర్ల విభాగాల్లో సిల్వర్ మెడల్స్ ► 2019లో సీబీఎస్ఈ సౌత్ జోన్ బెల్గాంలో జరిగిన పోటీలో 300 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 500 మీటర్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించింది. ► 2019లో ఇందిరాపార్కులో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో మూడు సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకుంది. ► 2020లో ఛంఢీగఢ్‌లో 57వ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 300 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకొని 500 మీటర్ల విభాగంలో ఫైనల్లో పాల్గొంది. మాకెంతో గర్వకారణం అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో దేశం తరపున మా అమ్మాయి ప్రాతినిథ్యం వహించాలనేది మాకల. అందుకోసం అవసరమైన శిక్షణ ఇప్పిస్తున్నాం. మా అమ్మాయి సాయివర్షిత స్కేటింగ్‌లో పతకాలు పొందడం ఎంతో సంతోషంగా ఉంది. స్కేట్–9 కోచ్ విఠలా ఆధ్వర్యంలో శిక్షణతో మరింతగా రాణిస్తోంది. – కిరణ్‌కుమార్ రెడ్డి దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యం అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నది లక్ష్యం. మా అమ్మానాన్న, కోచ్ విఠలా, టీచర్ల ప్రోత్సాహం ఎంతో ఉంది. మొదట్లో ఎంతో సరదాగా స్కేటింగ్ నేర్చుకున్నా. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడం సంతోషంగా ఉంది. – సాయివర్షితా రెడ్డి చదవండి: పెళ్లైన నెలకే మెడ కోసి.. -
'ఆంటీ వయసుకు వచ్చాక.. మన కలలను నెరవేర్చుకోవచ్చు'
‘ఆంటీ’ అనే మాటను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడరు. వయసును చెప్పడాన్నీ అంతగా ఇష్టపడరు. ఒక వయసు వచ్చాక వారు ఏదైనా భిన్నమైన పని చేస్తే ఎదుటివారు ఇష్టపడరు మరి. ‘ఇలా ఇష్టపడని వారంతా ఎటైనాపోండి’ అంటారు స్కేట్‌బోర్డ్ మీద రివ్వున దూసుకుపోయే ఊర్బీ రాయ్. కెనడాలో ఉన్న ఈ 46 ఏళ్ల భారతీయురాలు ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్. ‘ఆంటీ వయసుకు వచ్చాక కూడా మన కలలను నెరవేర్చుకోవచ్చు’ అని ఈమె సందేశం. రంగు రంగుల చీరతో స్కేటింగ్ విన్యాసాలు చేస్తూ ‘ఆంటీ స్కేట్స్’ పేరుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ‘పార్క్కో, పిక్నిక్కో వచ్చిన ఫ్యామిలీస్‌ని చూడండి. తండ్రి, పిల్లలు ఆడుతుంటారు. తల్లి దూరంగా కూచుని వారిని ఫొటోలు తీస్తుంటుంది. లేదా బ్లాంకెట్ పరిచి స్నాక్స్ రెడీ చేస్తూ ఉంటుంది. నేను అలాంటి తల్లిని కాను. నేను మాత్రం ఎందుకు ఆడకూడదు అనుకున్నాను’ అని నవ్వుతుంది 46 ఏళ్ల ఊర్బీ రాయ్. కోల్‌కతా నుంచి అమెరికా మీదుగా కెనెడా వలస వెళ్లి ప్రస్తుతం టొరొంటోలో నివాసం ఉంటున్న ఈ ఫ్యాషన్ డిజైనర్ తన టిక్‌టాక్‌ల ద్వారా 90 వేల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుని స్టార్‌డమ్‌ను అనుభవిస్తోంది. ఇంతవరకూ ఆమె టొరెంటోలో మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచమంతా తెలుసు. దానికి కారణం ఈ వయసులో ఆమె అద్భుతంగా స్కేటింగ్ చేయడమే. భారతీయ స్త్రీగా చీర కట్టుకుని మరీ స్కేటింగ్ చేసి ఆమె ప్రశంసలు అందుకుంటోంది. ఆంటీ స్కేట్స్ కెనడాలో టిక్‌టాక్ ఉంది. బ్యాన్ కాలేదు. అక్కడ టిక్‌టాక్‌లో ‘ఆంటీ స్కేట్స్’ అనే అకౌంట్ కింద ఊర్బీ రాయ్ అప్లోడ్ చేసే వీడియోస్ వైరల్‌గా మారాయి. టిక్ టాక్ ఉన్న అనేక దేశాలలో ఇప్పుడు వాటిని పదే పదే చూస్తున్నారు. ‘సాధారణంగా స్కేట్బోర్డింగ్ని పిల్లల ఆటగా చూస్తారు. ఆ తర్వాత కుర్రాళ్ల ఆటగా చూస్తారు. టీనేజ్ దాటాక దీని జోలికి వచ్చేవాళ్లు తక్కువ. నా వయసు స్త్రీలు, అందునా ఇద్దరు పిల్లల తల్లి స్కేట్బోర్డింగ్ చేస్తుండేసరికి చాలామంది ఇన్‌స్పయిర్ అవుతున్నారు’ అంటుంది ఊర్బీ. ‘నా భర్త సంజీవ్ స్కేట్బోర్డింగ్ చేస్తాడు. నా ఇద్దరు పిల్లలకూ అది ఇష్టమే. వారితో పాటు కలిసి నేను స్కేట్పార్క్లకు వచ్చి వారు ఆడుతుంటే చూసేదాన్ని. ఎన్నాళ్లని చూడను? ఒకరోజు స్కేట్‌బోర్డ్‌ను కాళ్ల కిందకు తీసుకున్నాను. వెంటనే దానిని స్వారీ చేశాను’ అంటుంది ఊర్బీ. ఆమె వీడియోలకు ‘ఆంటీ స్కేట్స్’ అనే టైటిల్ ఎందుకు పెట్టింది అని అడిగితే ‘ఆంటీలు చాదస్తం అని చాలామంది అనుకుంటారు. ఆంటీలు అదిలా ఇదిలా అని వంకలు పెడుతుంటారు, జడ్జ్ చేస్తుంటారు అని కూడా అనుకుంటూ ఉంటారు. కాని ఆంటీలు కూడా జీవితాల్లో కొత్తది చేస్తారు. చేయగలరు. వారు కుర్రవయసులో ఉన్నవారితో సమంగా ఉత్సాహంగా ఉండగలరు అని చెప్పడానికే ఆంటీ స్కేట్స్ అనే పేరు పెట్టాను’ అంటుంది ఊర్బి. కోల్కటా వాసి అయితే ఇలా స్కేటింగ్ చేస్తూ వార్తలకెక్కిన ఊర్బి కేవలం స్కేటింగ్‌తో కాలక్షేపం చేసే హౌస్‌వైఫ్ కాదు. ఆమె భర్త సంజీవ్, ఆమె ఇద్దరూ న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేశారు. ‘ఆ ఉద్యోగం నా జీవితాన్ని నమిలేస్తుందని అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా ఆసక్తి. మార్కెట్లో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయో గమనించేదాన్ని. మా అమ్మ ద్వారా నాకు భారతీయ సంస్కృతిని డిజైనింగ్‌లో ఎలా వాడాలో తెలిసింది. అందుకని ఇక్కడ ‘ఓమ్ హోమ్’ పేరుతో నా ఔట్లెట్ తెరిచాను. కోల్‌కతాలో కొంతమంది నేతగాళ్లను, టైలర్లను పనిలోకి తీసుకుని అక్కడ తయారు చేయించి ఇక్కడ నుంచి మార్కెటింగ్ చేస్తున్నాను’ అంటుంది ఊర్బి. ఆమె భర్తతో కలిసి కెనడాకు వలస వచ్చింది. ఊర్బి కుటుంబం ముందు నుంచి వ్యాపార రంగంలో ఉంది. ‘మా ముత్తాత బెంగాల్ పల్లెల నుంచి మొదటిసారి కోల్‌కతా వచ్చి ఇంటింటికి తిరిగి సబ్బులమ్మేవాడు’ అంది ఊర్బి. కష్టమే కాని తప్పదు ‘‘ఒక వయసు వచ్చిన స్త్రీలు ప్రాణం సుఖంగా ఉంది కదా ఇప్పుడు కొత్త కష్టాలు ఎందుకు అనుకుంటారు. 2018లో స్కేట్బోర్డింగ్ నేర్చుకునే సమయంలో ఇది నాకు అవసరమా అని ఒక క్షణం అనిపించింది. కొత్తది నేర్చుకోగలనా అనే సంశయం కూడా ఉండింది. కాని లేదు.. చేయాల్సిందే అని ముందుకు వెళ్లాను. ఇవాళ టొరెంటోలో స్కేట్బోర్డింగ్ కమ్యూనిటీ అంతా నన్ను చాలా గౌరవిస్తుంది. నా చేత ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ కొత్త పిల్లలు ఈ ఆటను నేర్చుకుంటున్నారు. అది కాదు విశేషం. ఎన్నో దేశాలలో చాలామంది నా వయసు వారు ‘నిన్ను చూసి ఇన్‌స్పయిర్ అయ్యి స్కేట్బోర్డింగ్ నేర్చుకుంటున్నాం’ అని నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? జీవితం ఎప్పుడూ పూర్తయినట్టు కాదు. కొత్తగా ప్రారంభించవచ్చు’’ అంటుంది ఊర్బి. – సాక్షి ఫ్యామిలీ -
ఆడపిల్లలను దూసుకెళ్లమనే స్కేటర్ గర్ల్
స్కేటింగ్ బోర్డ్ ఈ దేశంలో ఎంత మంది పిల్లలకు అందుబాటులో ఉంటుందో తెలియదుగాని ఉత్తర భారతదేశంలో పల్లెటూరి అమ్మాయిలకు ఇదో వింతే. రాజస్థాన్‌లోని ఒక అమ్మాయి ఈ చక్రాల పలకతో ప్రేమలో పడితే ఊరు ఏమంటుంది? తల్లిదండ్రులు ఏమంటారు? ఎన్నో అడ్డంకులను దాటి ఊళ్లో ఒక స్కేటింగ్ గ్రౌండ్‌ను ఆ అమ్మాయి ఎలా ఏర్పాటు చేసుకొని ఛాంపియన్ అయ్యింది? మొదటిసారిగా స్కేటింగ్ బోర్డ్ నేపథ్యంలో ఈ సినిమా తయారయ్యింది. క్రిస్టఫర్ నోలన్ దగ్గర శిష్యరికం చేసిన మన ముంబై దర్శకురాలు మంజరి మాకిజనీ దీని దర్శకురాలు. జూన్ మొదటివారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా సందేశం... పరిచయం... పల్లెటూరి అమ్మాయిలంటే తాటికాయలకు పుల్ల గుచ్చి బండిలాగా లాగేంత వరకూ తెలియనిస్తారు. సైకిల్ తొక్కడం ఒక మేరకు ఓకే. ఇక వాళ్ల ఆటలన్నీ ఇంటికే పరిమితం అనుకునే పరిస్థితే మన దేశంలో. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా ఉత్తరాదిలో పల్లెటూరి ఆడపిల్లలు తొందరగా ఎదిగితే తొందరగా పెళ్లి చేసి పంపించేయాలనే భావజాలంలోనే పెంచబడతారు. కాని వారికీ కలలుంటాయి. వారికీ సామర్థ్యాలు ఉంటాయి. వారికీ నిరూపణా శక్తి ఉంటుంది. వారికీ విజయ కాంక్ష ఉంటుంది. వారికీ అవకాశాలు పొందే హక్కు ఉంటుంది అని చెప్పే సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలా వస్తున్న సినిమా ‘స్కేటర్ గర్ల్’. ఇండో–అమెరికన్ సినిమాగా హాలీవుడ్ ప్రేక్షకులను, భారతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తయారైన ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్’లో జూన్ 11 నుంచి స్ట్రీమ్ కానుంది. దీని దర్శకురాలు మంజరి మాకిజనీ. హాలీవుడ్లో మన స్త్రీ దర్శకురాలు ‘షోలే’ సినిమా చూసిన వారందరికీ అందులో మెక్ మోహన్ పోషించిన ‘సాంబ’ పాత్ర గుర్తుండే ఉంటుంది. ఆ మెక్ మోహన్ కుమార్తే మంజరి మాకిజనీ. ‘చిన్నప్పుడు నాన్నతో పృథ్వీ థియేటర్ (ముంబై)కు వెళ్లి నాటకాలు చూసి ఆయనతో చర్చించడం నా మీద ప్రభావం చూపింది’ అంటుంది మంజరి. గత ఏడేళ్లుగా లాస్ ఏంజెలెస్ లో స్థిరపడి హాలీవుడ్ కోసం కూడా పని చేస్తున్న మంజరి బాలీవుడ్లో విశాల్ భరద్వాజ్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌కు వెళ్లి క్రిస్టఫర్ నోలన్ ‘డన్కిర్క్’కు పని చేసింది. ఆమె తీసిన షార్ట్ ఫిల్మ్ ‘ఐ సీ యూ’, ‘ది లాస్ట్ మార్బెల్’, ‘ది కార్నర్ టేబుల్’ అనే షార్ట్ ఫిల్మ్స్‌కు చాలా పేరు వచ్చింది. ఎంత పేరు వచ్చిందంటే ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’ తన 2016లో నిర్వహించిన మహిళా డైరెక్టర్ల వర్క్‌షాప్‌కు ఆహ్వానం అందేంత. అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 1973 నుంచి ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటే ఇప్పటివరకూ ఆహ్వానం అందుకున్న భారతీయులలో మంజరి రెండవ వ్యక్తి అంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆమెకు నోలన్ వంటి ప్రఖ్యాత దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. స్కేటర్ గర్ల్ ఇంత అనుభవం తర్వాత మంజరి ‘స్కేటర్ గర్ల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ ఆడపిల్లలకు స్ఫూర్తినిచ్చే, వారి కలలకు ఊతం ఇచ్చే ఈ కథను ఆమె తన సోదరి వినతి మాకిజనీతో కలిసి రాసుకుంది. బాలీవుడ్లో ఇప్పటి వరకూ హాకీ, బాడ్మింటన్, క్రికెట్ వంటి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాలు వచ్చాయి. కాని దేశంలో ఎక్కడా ‘స్కేట్‌బోర్డ్’ నేపథ్యంగా సినిమా రాలేదు. ‘స్కేటర్ గర్ల్’ మొదటిది. అందుకే ఈ సినిమా మీద అందరికీ ఆసక్తి నెలకొంది. అడ్డంకులు దాటాలా? రాజీ పడాలా? బ్రిటన్‌కు చెందిన ఒక యాడ్ ప్రొఫెషనల్ జెస్సికా (బ్రిటిష్ నటి అమి మఘేరా) రాజస్థాన్‌లోని మారుమూల పల్లెకు షూటింగ్ నిమిత్తం రావడంతో ఈ కథ మొదలవుతుంది. అక్కడ పిల్లలు చక్రాలు బిగించుకున్న కర్రబల్లను లాక్కుంటూ ఆడుకుంటున్నారు. ఈ బల్ల స్కేట్‌బోర్డ్‌కు దగ్గరగా ఉంది అని జెస్సికా గమనిస్తుంది. అంతేకాదు, ఆ ఊరి అమ్మాయి ప్రేరణ ఆ బల్లను బేలెన్స్ చేయడంలో ఎంతో ప్రావీణ్యం చూపించడం కూడా గమనిస్తుంది. అంతే. ఆ పిల్లలందరికీ స్కేట్‌బోర్డ్ కొనిచ్చి వారిని అందులో ఎంకరేజ్ చేస్తుంది. కాని అసలే పల్లెటూరు. ఆపైన ఆడపిల్ల. ప్రేరణకు స్కూల్లో, ఇంట్లో, ఊళ్లో ఎన్నో అడ్డంకులు. ఆడపిల్ల ఇలాంటి ఆట ఆడటం ఏమిటి? అని. అయితే ఆ ఆడపిల్ల ఆ ఆట ఆడటమే కాదు ఊళ్లో పిల్లలందరూ ఆడుకోవడానికి కమ్యూనిటీ స్కేటింగ్ పార్క్ నిర్మించడానికి కంకణం కట్టుకుంటుంది. అంతే కాదు, ప్రాక్టీసు చేసి ఛాంపియన్షిప్ సాధించాలని పట్టుబడుతుంది. ‘స్కేటర్ గర్ల్’ దర్శకురాలు మంజరి మాకిజనీ. ‘నీ భయాన్ని జయించాలనంటే దానిని ఎదుర్కొనడమే మార్గం’ అంటుంది ప్రేరణ. ఆడపిల్లలుగాని, యువతులుగాని, స్త్రీలు గాని తమ గమనంలో ఫలానా అడ్డంకి వస్తుందని భయపడి ఆగిపోవడం కంటే దానిని గెలవడానికి దానిని ఎదుర్కొనడమే మంచిది అని ఈ సినిమా చెబుతుంది. మంచి సాంకేతిక నిపుణులు, నటీనటులు పాల్గొన్న ఈ సినిమాలో సీనియర్ నటి వహీదా రహమాన్ ఒక ముఖ్యపాత్ర పోషించడం విశేషం. ఇంకో పది రోజుల్లో చూడటానికి సిద్ధంగా ఉండండి. – సాక్షి ఫ్యామిలీ -
వైరల్: స్కేటింగ్ అదరగొట్టిన కుక్క పిల్ల
-
వైరల్: స్కేటింగ్ అదరగొట్టిన కుక్క పిల్ల
కొన్ని ఆటల్లో మనుషుల కంటే జంతువులే తమ ప్రతిభను చాలా చక్కగా కనబరుస్తాయనడంలో సందేహం లేదు. సాధారణంగా మనుషులు స్కేటింగ్ చేస్తేనే.. ఎక్కడో ఒక చోటు బ్యాలన్స్ తప్పి పడుతూ, లేస్తూ ముందుకు వెళ్లుతారు. అలాంటిది ఓ కుక్క పిల్ల రోడ్డుపై చేసిన స్కేటింగ్ వీడియోను చూస్తే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. ప్రస్తుతం ఆ కుక్క పిల్ల చేసిన స్కేటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. ఈ వీడియోను అమెరికన్ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ తన ట్వీటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘స్కేటర్ గుడ్ బాయ్...’అని కాప్షన్ జతచేశారు. ఆ కుక్క పిల్ల స్కేటింగ్ బోర్డుపై నిలబడి రోడ్డుపై దర్జాగా స్కేటింగ్ చేస్తూ ఉంటే దాన్ని చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. ఆ చిన్న కుక్కపిల్ల చాలా సులువుగా చేస్తున్న స్కేటింగ్ రోడ్డుపై ఉన్న కొందరిలో నవ్వులు పూయించింది. అది రోడ్డు మీద ఉన్న ఓ మూల మలుపును కూడా చాలా చక్కగా దాటుకుంటూ మరో రోడ్డుపైకి వెళ్తుతుంది. చాలా దూరం స్కేటింగ్ చేసిన కుక్క ఒకసారి స్కేటింగ్ బోర్డు దిగి అదే హుషారుతో మళ్లీ స్కేటింగ్ చేస్తుంది. ఈ క్రేజీ వీడియోను ఇప్పటికే సుమారు ఆరు లక్షల మంది వీక్షించగా, పదివేల లైక్‌లు, రెండు వేల రీ ట్వీట్లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ కుక్క పిల్ల నాకుంటే చాలా ప్రశాంతంగా స్కేటింగ్ చేస్తోంది’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఓ మై గాడ్.. చాలా అద్భుతం’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. -
అనిల్‌కు ‘గిన్నిస్‌బుక్’లో చోటు
కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లాకు చెందిన రోలార్ స్కేటింగ్ సీనియర్ క్రీడాకారుడు, కోచ్ గట్టు అనిల్ కుమార్ స్కేటింగ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. కర్ణాటకలోని బెల్గంలో గత ఏడాది అక్టోబర్ 30నుంచి నవంబర్ 3వరకు జరిగిన లాంగెస్ట్ కాంగో లైన్ ఆన్ స్కేటింగ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో పాల్గొని ప్రతిభచూపాడు. లాంగెస్ట్ కాంగో స్కేటింగ్ కాంపిటేషన్‌లో 48గంటలు స్కేటింగ్ చేశారు. సోమవారం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు అనిల్‌కు సర్టిఫికెట్, మెడల్ పంపించారు. అనిల్‌ను మంగళవారం జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి కీర్తి రాజవీరు అభినందించారు. -
ఆన్య ఖురానాకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: లెజెండ్ హంట్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్లో ఆన్య ఖురానా విజేతగా నిలిచింది. ఇందిరా పార్క్‌లోని స్కేటింగ్ రింక్ వేదికగా ఆదివారం జరిగిన 9–11 బాలికల ఫైనల్లో ఆన్య అగ్రస్థానాన్ని దక్కించుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. రోలర్ హాక్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో రిధి పటేల్ రజతాన్ని సొంతం చేసుకోగా... నమితా నిరెల్ ఆడమ్స్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత రోలర్ స్కేటింగ్ సమాఖ్య ప్రతినిధి అమిత్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. -
బాలికా విద్యపై స్కేటింగ్ యాత్ర
గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 40శాతం బాలికలు మాత్రమే విద్యనభ్యసించగల్గుతున్నారు.50శాతం పిల్లలు ముఖ్యంగా బాలికలు పదో తరగతికి ముందే స్కూల్ మానేస్తున్నారు. ఇలాంటి వివరాలు చదివినప్పుడు కాసేపు చింతిస్తాం. ఆ తర్వాత మర్చిపోతాం. కానీ కొందరే ఈ పరిస్థితిని మార్చాలని ఆలోచిస్తారు. అందుకు ముందడుగు వేస్తారు. అందులో ఒకరే అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడాకారుడు ఉప్పలపాటి రానా. మహిళలు విద్యావంతులైనప్పుడే భవిష్యత్తు బాగుంటుందని, అందుకు ఏదైనా చేయాలని సంకల్పించిన రానా... బాలికా విద్యపై అవగాహన కల్పించేందుకు 6వేల కి.మీ స్కేటింగ్ యాత్రను పూర్తి చేశాడు. సాక్షి, సిటీబ్యూరో : వైజాగ్ చెందిన ఉప్పలపాటి రానా ఈ యాత్రలో భాగంగా 25వేల మంది బాలికల విద్యావసరాలకు అవసరమైన నిధులు సేకరించాలని సంకల్పించాడు. ఈ సంకల్పానికి ‘టైటాన్’ కంపెనీ సహకారం తోడైంది. పేద బాలికల విద్య కోసం నిధులు సమీకరించేందుకు ఎకో (ఎడ్యుకేట్ టు క్యారీ హర్ ఆన్వర్డ్స్) కార్యక్రమాన్ని చేపట్టిన ‘టైటాన్’ రానాకు అన్ని విధాలుగా సహకరించింది. సెప్టెంబర్ 5న కర్ణాటకలోని హోసూర్‌లో ప్రారంభమైన ఈ స్కేటింగ్ యాత్ర 6 వేల కి.మీ సాగి డిసెంబర్ 13న ముగిసింది. అందరి సహకారంతో ఒక పాపకి పుస్తకాలు, బ్యాగ్ ఇలా బేసిక్‌గా 3,600 విద్యావసరాలుంటాయని గుర్తించాం. ఆ లెక్కన ఈ యాత్రలో దాదాపు 18వేల మంది బాలికల విద్యకు కావాల్సిన నిధులు సేకరించగలిగాం. దీనికి అందరూ సహకరించకపోతే నిధులు వచ్చేవి కావు. నేను 6వేల కి.మీ స్కేటింగ్ పూర్తి చేసేవాడినీ కాదు. మంచి ఉద్దేశానికి చాలా మంది తోడ్పాటునందిస్తారనేది నేనీ జర్నీలో తెలుసుకున్న ముఖ్యమైన విషయం. అయితే ఏదో సాధించాననే దాని కంటే... ఇంత పెద్ద దేశంలో బాలికా విద్యను గుర్తించి, దానికేమైనా చేయాలని ఆలోచించే వాళ్లు ఇంకా ఎవరూ లేరా? అనిపిస్తోంది. ఎందుకంటే 25వేల మందికి సహకారం అందించడంతో ఈ సమస్య తీరిపోదు. ఇంకా ఎంతో మంది అవసరార్థులు ఉన్నారు. అందరూ దీనిపై ఆలోచిస్తేనే బాలికా విద్య సాధ్యమవుతుంది. ఆ ఆలోచనతోనే... ‘గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ అక్షరాస్యతా 40శాతమే. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా మన దేశంలో 50శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మాతాశిశు మరణాలు, భ్రూణ హత్యలు, వరకట్న వేధింపులు ఇలా ఎన్నో సమస్యలున్నాయి. దేశంలో ప్రతి 30 నిమిషాలకు ఇద్దలు బాలలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇవన్నీ విని ఊర్కుంటే కుదరదు. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఏదైనా చేయాలి. అదే ఆలోచనతో ఈ యాత్ర చేపట్టాను. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మనకు బాధ్యతలున్నట్లే సమాజం విషయంలోనూ మనకు కొంత బాధ్యత ఉంటుంది. అది సామాజిక సేవగా కాకుండా బాధ్యతగా చేయాలి. మన చుట్టూ ఉన్న వారి విషయంలోనూ మనకు బాధ్యత ఉందని నేను నమ్ముతాను. కేన్సర్ అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అందులో నాకు అర్థమైందేమిటంటే 40 ఏళ్లు వచ్చిన తర్వాత మహిళలకు కేన్సర్, ఆరోగ్యం గురించి అవగాహన కల్పించటం కన్నా... చిన్నప్పటి నుంచే విద్యావంతులను చేస్తే అన్ని విధాల మేలు’ అని చెప్పారు రానా. 76 రోజులు... యాత్ర ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించింది. గంటకు 12–15 కి.మీ స్కేటింగ్ చేసేవాడిని. ఇక చివరి యాత్ర రోజుల్లో గంటకు 20–25 కి.మీ చేయగలిగాను. రోజుకు సగటున 80కి.మీ చేసేవాడిని. మొత్తం 100 రోజుల యాత్రలో 76రోజులు స్కేటింగ్ చేశాను. మిగతా రోజుల్లో నేను ప్రయాణించిన ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ సహా 70 నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. ఎవరైనా నిధులు ఇవ్వాలనుకుంటే ఠీఠీఠీ.్టజ్టీ్చnఛిౌఝp్చny.జీn/్ఛఛిజిౌ వెబ్సైట్ ద్వారా అందించొచ్చు. వాటిని ఇంపాక్ట్, నన్హీ కలీ స్వచ్ఛంద సంస్థలు బాలికా విద్య కోసం వెచ్చిస్తాయి. -
హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఓయూలోని శాట్స్ సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో బుధవారం జరిగిన జూనియర్ బాలుర ఇన్లైన్ హాకీ ఈవెంట్లో హైదరాబాద్ 2–0తో మెదక్‌పై, రోలర్ హాకీ ఈవెంట్లో 4–1తో కరీంనగర్‌పై, సబ్ జూనియర్ బాలుర రోలర్ హాకీలో హైదరాబాద్ 3–1తో కరీంనగర్‌పై, సీనియర్ మహిళల ఇన్లైన్ హాకీలో 7–0తో మెదక్‌పై విజయం సాధించాయి. సబ్ జూనియర్ బాలికల ఇన్లైన్ హాకీలో హైదరాబాద్ 0–1తో మెదక్ చేతిలో, 1–4తో కరీంనగర్ చేతిలో, రోలర్ హాకీలో 1–6తో మెదక్ చేతిలో ఓటమి పాలయ్యాయి. పురుషుల ఇన్లైన్ హాకీలో మెదక్ 8–0తో నల్లగొండపై, మెదక్ 10–0తో మహబూబ్‌నగర్‌పై నెగ్గి ముందంజ వేశాయి. -
విజేతలు ఆర్నవి, వేదాంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆర్నవి, వేదాంత్ విజేతలుగా నిలిచారు. ఇందిరాపార్క్‌లో ని స్కేటింగ్ రింక్‌లో జరిగిన ఈ టోర్నీ అండర్–8 బాలికల ఇన్లైన్ ఈవెంట్లో నిజామాబాద్‌కు చెందిన ఆర్నవి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మనోజ్ఞ (మహబూబ్‌నగర్) రన్నరప్‌గా నిలవగా, స్నిగ్ధ (నల్లగొండ) మూడోస్థానాన్ని సాధించింది. బాలుర విభాగంలో వేదాంత్ (నల్లగొండ) చాంపియన్‌గా నిలిచాడు. కుషాగ్ర నిగమ్ (నల్లగొండ), కార్తీక్ (హైదరాబాద్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. -
మనోళ్లకు మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: లండన్ ఇన్లైన్ మారథాన్ స్కేటింగ్ కాంపిటీషన్లో తెలంగాణ స్కేటర్లు చాణక్య, ఎన్. అనిరుధ్, మోనిశ్ సాయి ప్రతిభ కనబరిచారు. లండన్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మూడు పతకాలను సాధించారు. చాణక్య రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకోగా... అనిరుధ్, మోనిశ్ సాయి మూడోస్థానంలో నిలిచి కాంస్యాలను అందుకున్నారు. -
విజేతలు బహుషిరా, రియా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్కేటింగ్ మీట్లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్‌కోఠి విద్యార్థులు ఎం. బహుషిరా, రియా విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన అండర్–19 బాలబాలికల క్వాడ్ 300 మీ. ఈవెంట్లో వీరిద్దరూ స్వర్ణాలను సాధించారు. బాలుర విభాగంలో బహుషిరా లక్ష్యాన్ని 41.80 సెకన్లలో చేరుకొని అగ్రస్థానంలో నిలవగా, ఎస్. అవినాశ్ 47.99 సెకన్లలో ముగించి రజతాన్ని గెలుచుకున్నాడు. కాంస్యాన్ని సాధించిన రాజమండ్రి ఫ్యూచర్‌కిడ్స్ అథ్లెట్ టి. శ్రీవత్స 49.45 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నాడు. బాలికల విభాగంలో రియా 44.44 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి పసిడిని సాధించింది. మలక్‌పేట్ సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన సోనాలి 52.49 సెకన్లలో, ఖైరతాబాద్ ఎన్ఏఎస్ఆర్ బాలికల స్కూల్‌కు చెందిన సయేదా అయేషా ఫరీస్ 1ని. 22.85 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. ఇందిరాపార్క్ స్కేటింగ్ రింక్‌లో జరిగిన పోటీల్లో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నగర పోలీస్ అదనపు కమిషనర్ డీఎస్ చౌహాన్ ముఖ్య అతిథిగా వచ్చేసి అథ్లెట్లకు పతకాలను అందజేశారు. -
భర్తపై క్రీడాకారిణి రుచికా జైన్ ఫిర్యాదు
-
స్కేటింగ్ క్రీడాకారిణికి తప్పని వేధింపులు
-
భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రీడాకారిణి
సాక్షి, హైదరాబాద్ : స్కేటింగ్ క్రీడాకారిణి రుచిక పోలీసులను ఆశ్రయించారు. భర్త అక్షయ్ కటారియా తనను మోసం చేశారంటూ బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఈ విషయంపై పలుసార్లు కుటంబ సభ్యులకు చెప్పినా ఫలితం లేదని రుచిక ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితమే రుచికకు అక్షయ్‌తో వివాహమైంది. -
పాండ్యా ప్రపంచ రికార్డుకు 29 ఏళ్లు
నూఢిల్లీ : క్యాన్సర్ మహ్మమారిపై అవగాహన కల్పించాడానికి దేశ రాజధాని ఢిల్లీ నుంచి అహ్మాదాబాద్ వరకు కేవలం ఐదేళ్ల పసిప్రాయంలోనే రోలర్ స్కెటింగ్ చేసింది. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పింది రోలర్ స్కెటర్ షీతల్ పాండ్యా. 1989 జూన్ 7న ఆమె గిన్నిస్ బుక్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఐదేళ్లప్పుడు ఆ పిడుగు సాధించిన విజయానికి నేటితో 29 ఏళ్లు నిండాయి. తన తండ్రి జగదీష్ పాండ్యాతో కలిసి అతి చిన్న వయసులో అంత దూరం రోలర్ స్కెటింగ్ చేస్తూ ఆమె ఈ ఘనత సాధించింది. అంతే కాకుండా 2009లో కూడా ఆరు రాష్ట్రాల మీదుగా రోలర్ స్కెటింగ్ చేస్తూ ఆడ పిల్లల రక్షణపై అవగాణ కలిగించింది. ‘సెవ్ గర్ల్ చెల్డ్’ అనే పేరుతో ఆమె ఈ ప్రయాణం సాగించింది. -
ఫల్గుణికి రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి కైరవి ఫల్గుణి ఠక్కర్ ఆకట్టుకుంది. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో ఆమె రజత పతకాన్ని సాధించింది. 16 ఏళ్ల పైబడిన బాలికల ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ సోలో డ్యాన్స్ ఈవెంట్లో ఫల్గుణి రన్నరప్‌గా నిలిచింది. ఈ విభాగంలో తమిళనాడుకు చెందిన ప్రణమ్య రావు, వసస్య వరుసగా పసిడి, కాంస్యాలు సాధించింది.