హజ్‌యాత్రికులకు మెరుగైన ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: హజ్ యాత్రికులకు మెరుగైన వసతులు కల్పించే విధంగా ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్ వెల్లడించారు. ఆది వారం స్థానిక ఆజాంపురాలోని సహిఫా మసీదులో ఏర్పాటు చేసిన హజ్‌యాత్ర అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హజ్‌యాత్రికుల కోసం హజ్‌హౌస్‌లో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదారబాద్ క్యాంప్ నుంచి యాత్రికులు బయలుదేరి మక్కా మదీనాలో ప్రార్థనలు పూర్తి చేసుకొని తిరిగి క్యాంపునకు చేరుకునే వరకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సదుపాయలతో కూడిన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
హజ్ యాత్ర–2016 ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుందని, నిర్దేశించిన ఫ్లైట్ షెడ్యూలు కంటే రెండు రోజుల ముందు క్యాంప్‌కు చేరుకోవాలని సూచించారు. మక్కా మదీనాలో సైతం ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రుబాత్ బసకు ఎంపికైన వారికి మాత్రం బస రుసుం తిరిగి చెల్లిం చడం జరుగుతుందన్నారు. హజ్‌యాత్రపై పూర్తి స్థాయి అవగాహన చేసుకొని విజయవతంగా ప్రార్థనలు ముగించుకొని రావాలని ఆయన ఆకాంక్షిం చారు. కుల్‌హింద్ కార్యదర్శి, మాజీ రాష్ట్ర హజ్ కమటీ సభ్యుడు సయ్యద్ అబుల్ పత్హే బందగి బాషా రియాజ్ ఖాద్రీ, హజరత్ సయ్యద్ అజమ్ అలీ సుఫీ తదితరులు పాల్గొన్నారు.