sperm whale
-
సుడి తిరిగింది.. కళేబరం కడుపున కోట్లు!
అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాగే ఆలస్యం చేస్తే ఆ అదృష్టం అందకుండా పోవచ్చు కూడా. కానీ, యెమెన్లో కొందరు జాలర్లు అదృష్టాన్ని అమాంతం ఒడిసి పట్టుకున్నారు. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించారు. ఆ దక్కిన దానితో ఊరును బాగుచేసేందుకు ఖర్చు చేస్తున్నారు కూడా. యెమెన్: చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన జాలర్ల గుంపుకి జాక్పాట్ తగిలింది. చనిపోయిన ఓ భారీ తిమింగలం కడుపు నుంచి విలువైన వస్తువును వెలికి తీశారు. దీంతో అది వాళ్ల తలరాతనే మార్చేసింది. అల్-ఖైసా గ్రామానికి చెందిన కొందరు జాలర్లకు గల్ఫ్ ఆడెన్ సమీపంలో చేపల వేటకు వెళ్లారు. ఆ టైంలో చచ్చిన భారీ తిమింగలం కళేబరం సముద్రంపైన తేలుతూ కనిపించింది. వెంటనే 35 మంది జాలర్లు.. ఆ కళేబరాన్ని అతికష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చారు. చివరికి దాన్ని చీల్చగా.. అత్యంత విలువైన అంబర్గ్రిస్ బయటపడింది. సముద్రపు బంగారం అంబర్గ్రిస్ అంటే తిమింగలం వాంతి. తిమింగలం జీర్ణించుకోలేని వాటిని కడుపులో ఘన పదార్థంగా మైనపు పదార్థం రూపంలో నిల్వ ఉంచుకుంటుంది. ఒక్కోసారి వాంతి రూపంలో వెలువడి నీళ్లలో తేలుతుంది. లేదంటే చనిపోయాక(వేటాడతారు కూడా) దాని కడుపు నుంచి బయటకు వస్తుంది. దీనిని సెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. కాబట్టే భారీ డిమాండ్ ఉంటుంది. ఇక యెమెన్ జాలర్లకు స్పెర్మ్ వేల్ కడుపులో 127కేజీల బరువు అంబర్గ్రిస్ కనిపించింది. అది విలువైందని వాళ్లకు తెలుసు. కాబట్టి ఓ దుబాయ్ డీలర్ సాయంతో మార్కెట్లో దాన్ని అమ్మేశారు. అంబర్గ్రిస్ అమ్మేయాగా సుమారు రూ.10కోట్లు సొమ్ము వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సొమ్మును ఆ 35 మంది పంచుకోవడంతోనే ఆపకుండా.. తమ కమ్యూనిటీలోని మరికొందరికి ఆర్థిక సాయం చేశారు. ఊరును బాగు చేసుకున్నారు కూడా. ఇక సువాసన వెదజల్లే అంబర్గ్రిస్కి చైనా, జపాన్, ఆఫ్రికా, అమెరికా, గల్ప్ దేశాల పముద్ర తీరాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఆ జనవరిలో థాయ్లాండ్లో 20 ఏళ్ల ఓ కుర్రాడికి అంబర్గ్రిస్ ముద్ద దొరకడంతో కోటీశ్వరుడు అయ్యాడు. చదవండి: పోర్న్ తీయాలనుకున్న ఆ స్టార్ దర్శకుడెవరు? -
స్పెర్మ్వేల్ కడుపులో 25 కేజీల ప్లాస్టిక్
మాడ్రిడ్, స్పెయిన్ : స్పెయిన్లోని ఓ బీచ్లో తీవ్ర విషాదం నెలకొంది. పది మీటర్ల పొడవున్న ఓ భారీ వేల్ చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. వేల్ మృతికి కారణం తెలుసుకునేందుకు పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. వేల్ పొట్టలో దాదాపు 25 కేజీల ప్లాస్టిక్ ఉన్నట్లు వారు గుర్తించారు. ప్లాస్టిక్ బ్యాగ్స్, వలలు, జెర్రీ క్యాన్స్ను తినడం వల్ల జీర్ణాశయంలో ఏర్పడ్డ ఇన్ఫెక్షన్ కారణంగా వేల్ మరణించిందని వెల్లడించారు. సముద్రాల్లో ప్లాస్టిక్ వేస్ట్ పెరిగిపోతుండటం వల్ల జలచరాలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. తాజా సంఘటన స్పెయిన్ అధికారులను ఓ కొత్త నిర్ణయం తీసుకునేలా చేసింది. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లో పడేయకుండా వారిలో అవగాహన కలిగించాలని నిర్ణయించుకున్నారు. స్పెర్మ్వేల్.. ఆసక్తికర విషయాలు టూత్ వేల్, డాల్ఫిన్ జాతులకు చెందినవే ఈ స్పెర్మ్వేల్స్. చతురస్రాకారంగా ఉండే వేల్స్ తల లోపలి భాగంలో పాల లాంటి తెల్లని పదార్థం ఉండటం వల్ల వాటికి ఈ పేరు వచ్చింది. ఇవి ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల్లో నివసిస్తుంటాయి. స్పెర్మ్ వేల్స్ ఎక్కువగా సముద్రపు అడుగు భాగాల్లో జీవించడానికి ఇష్టపడతాయి. ఇవి దాదాపు 70 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి. పరిమళాల తయారీలలో స్పెర్మ్వేల్స్ను ఉపయోగిస్తారు. ఒక్కోసారి బంగారంతో సమానంగా స్పెర్మ్వేల్స్ల ధర ఉంటుంది. సముద్రపు అడుగు భాగాలకు వెళ్లగలిగే అతికొద్ది జీవుల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇవి దాదాపు రెండు గంటల పాటు నీటిలో ఊపిరి తీసుకోకుండా ఉండగలవు. ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ వేల్స్ సంఖ్య ఒక లక్షకుపై మాటే. -
తీరానికి చేరిన అరుదైన భారీ తిమింగలం
భువనేశ్వర్: తమిళనాడులోని ట్యూటికోరిన్ సముద్ర తీరానికి వందల కొద్ది తిమింగలాలు చనిపోయి తీరానికి కొట్టుకువచ్చిన ఘటన మరువకముందే అదే రీతిలో ఓ భారీ తిమింగలం ఒడిషాలోని గంజం తీరానికి వచ్చింది. ఈ తీరం రాజధాని భువనేశ్వర్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 33 అడుగులు ఉన్న ఈ భారీ తిమింగలం రక్తపుమడుగులో పడి ఉండటాన్ని తీరానికి వెళ్లిన స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఈ భారీ తిమింగలం రెండు, మూడు రోజుల కిందటే చనిపోయి ఉండొచ్చునని బెర్హంపూర్ డివిజన్ అటవీ అధికారి ఏకే బేహెరా అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతంలో తిరిగే కొన్ని ప్రత్యేక నౌకలు, ఓడలకు కింది ఉండే పదునైన భాగం తిమింగలాన్ని చీల్చకుంటూ పోవడం వల్ల ఈ భారీ ప్రాణి మరణించి ఉంటుందని గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని బెర్హంపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేసీ సాహు తెలిపారు. స్పెర్మ్ తిమింగలం దంతాలు ప్రపంచలోనే అతిపెద్దవన్న విషయం అందరికీ తెలిసిందే. 2,250 మీటర్ల లోతుకు కూడా వెళ్లగలగడం వీటి ప్రత్యేకత. సాధారణంగా సముద్ర తాబేళ్లు ఎక్కుగా ఈ తీరానికి వస్తుంటాయని ప్రొఫెసర్ వివరించారు. తిమింగలం చినిపోవడానికి అసలు కారణాలేంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.