18 ఏళ్లుగా మంచంపైనే..
చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సంపాదించిన ఓ యువకుడు తన కలలను సాకారం చేసుకోకముందే
జీవచ్ఛవంలా మారాడు. ఊహించని రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని నిత్యం నరకయూతన అనుభవిస్తున్నాడు. అరుుతే చెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు మంచానికే పరిమితం కావడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మెరుగైన వైద్యం చేరుుంచేందుకు దాతలు ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
వర్ధన్నపేట టౌన్ : మండల కేంద్రానికి చెందిన పసునూరి నారాయణ, ఉమామహేశ్వరి దంపతులకు నలుగురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. అరుుతే కొడుకు శ్రీధర్‌రాజు చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచేవాడు. కాగా, పదో తరగతి పరీక్షలో ఆయన అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. అనంతరం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ డిప్లొమాలో చేరాడు. కోర్సును అభ్యసిస్తున్న సమయంలోనే 1997లో హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టం నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యాంపస్ సెలక్షన్లో శ్రీధర్‌రాజు కస్టమర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కాగా, డిప్లొమా పూర్తరుున తర్వాత 1998లో కోల్‌కతా క్యాంపస్‌లో ఉద్యోగంలో చేరాడు. అక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించి అధికారుల మన్ననలు పొందాడు.
పర్వత శ్రేణుల్లో ప్రమాదం..
కోల్‌కతాలో పనిచేస్తున్న సమయంలోనే శ్రీధర్‌రాజు డిప్యూటేషన్‌పై అస్సాం రాష్ట్రంలోని గౌహతికి వెళ్లాడు. అరుుతే విధుల్లో భాగంగా అస్సాంలోని సిల్చర్ ప్రదేశానికి బస్సులో వెళ్తుండగా మార్గమధ్యలో మేఘాలయ రాష్ట్రంలోని లోయలో ప్రమాదవశాత్తు వాహనం పడింది. ఈ సంఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. ఇందులో శ్రీధర్‌రాజు కూడా ఉన్నారు. కాగా, బస్సు రోడ్డుపై నుంచి లోయలో పడడంతో శ్రీధర్‌రాజు వెన్నుపూసకు బలమైన గాయాలై శరీరమంతా చచ్చుబడి పోయింది. విషయం తెలుసుకున్న హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టం అధికారులు ఆయనను చెన్నైలోని రాంచంద్ర ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేరుుంచినా కోలుకోలేదు. దీంతో శ్రీధర్‌రాజు వికలాంగుడిగా మారి మంచానికే పరిమితమయ్యాడు.
మూలకణాల మార్పిడితో నయమయ్యే అవకాశం..
ఒక్కగానొక్క కొడుకు శ్రీధర్‌రాజుకు వైద్యం అందించేందుకు తల్లిదండ్రులు తమకున్న ఇల్లు, భూమిని మొత్తం అమ్ముకున్నారు. అరుుతే మూలకణాల మార్పిడితో శ్రీధర్‌రాజు 70 నుంచి 90 శాతం వరకు కోలుకునే అవకాశం ఉందని మహారాష్ట్రలోని పూనే స్టెమ్‌సెల్ సెంటర్ వైద్యుడు బగుల్ అనంత్ చైతన్య హామీ ఇచ్చారని తల్లిదండ్రులు చెప్పారు. కాగా, వైద్యం కోసం సుమారు రూ. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్ చెప్పారని, సామాన్య కుటుంబానికి చెందిన తమకు అంత ఖర్చుతో కొడుకుకు వైద్యం చేరుుంచే స్థోమత లేదని వారు బోరున విలపిస్తున్నారు.
పర్మనెంట్ కాని ఉద్యోగం..
శ్రీధర్‌రాజు ఉద్యోగం పర్మనెంట్ కాకపోవడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఇన్ఫోసిస్టం యాజమాన్యం ముం దుకు రాలేదు. దీంతో తల్లిదండ్రులు అప్పటినుంచి ఇప్పటివరకు జీవచ్ఛవంలా మా రిన కొడుకుకు నిత్యం చికిత్సలు చేరుుస్తున్నారు. కాగా, శ్రీధర్‌రాజుకు ఆయుర్వే దం, ఆక్యు పంక్చర్, హోమియోపతి, తదితర వైద్య చికిత్సలు చేరుుస్తున్నా ఇప్పటివరకు ఆయనలో ఎలాంటి ఫలితం కనిపించలేదు.