క్యాంపస్ డ్రైవ్‌లో 189 మంది ఎస్ఆర్కేఆర్ విద్యార్థులు ఎంపిక
భీమవరం : భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో కళాశాలకు చెందిన 189 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో 92 మంది మహిళలు, 92 మంది పురుషులు ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారధివర్మ చెప్పారు. కళాశాల సెమినార్హాలు టీసీఎస్ ప్రతినిధి కార్తీక ఎంపికైన వారి వివరాలను వెల్లడించారు. ఈనెల 7 నుంచి ఇంటర్యూ్వలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సాగి విఠల్‌రాజు మాట్లాడుతూ తమ కళాశాలలో ఫైనలియర్ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం క్యాంపస్ సెలక్షన్స్ల్లో వారికి ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల్లో ఈసీఈ విద్యార్థులు 60 మంది, సీఎస్ఈ విద్యార్థులు 48, ఈఈఈ విద్యార్థులు 26, మెకానికల్ విద్యార్థులు 20, సివిల్ విద్యార్థులు 15, ఐటీ విద్యార్థులు 15, పీజీ కోర్సుల విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారని కళాశాల ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇన్చార్జ్ డాక్టర్ కె.సురేష్‌బాబు చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సాగి అచ్యుతరామరాజు, చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, ప్రిన్సిపాల్ పార్థసారధివర్మ అభినందించారు.