ఆగస్టులో బెటాలియన్ ప్రారంభోత్సవం
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని సెంట్రల్ జైలు సమీపంలో ఉన్న 14వ పోలీస్ బెటాలియన్‌ను ఆగస్ట్‌లో ప్రారంభించనున్నట్లు కమాండర్ జగదీష్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని సెంట్రజైలు సమీపంలో 14వ పోలీస్ బెటాలియన్‌లో వనం - మనం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కమాండర్ జగదీష్‌కుమార్ మాట్లాడుతూ పోలీసులు ప్రజా రక్షణతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రెండు మొక్కలు నాటి, సంరక్షించాలన్నారు.
బెటాలియన్‌లో రూ. 13 కోట్లతో మొదటి విడత అడ్మినిస్ట్రేషన్ భవన నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. వీటిని ఆగస్టు నెలలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వెయ్యి మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఏడాది 10 వేల మొక్కలు నాటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండర్ ప్రభుకుమార్, అసిస్టెంట్ కమాండెన్స్ ఆనంద్ కన్నా, విల్సన్ కేర్, ఇన్స్పెక్టర్ దస్తగిరి, సబ్ఇన్స్పెక్టర్లు వీబీ వర్మ, రఘురాం, మల్లికార్జున, బలరాం నాయక్, బెటాలియన్ పోలీసులు పాల్గొన్నారు.