ప్రజల రుణం తీర్చుకుంటా : రోజా
నిండ్ర, న్యూస్‌లైన్: తనను గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి రుణం తీర్చుకుంటానని నగరి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆర్కే.రోజా అన్నారు. వుండలంలోని కొప్పేడులో ఆదివారం ఆమె కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తల అండతోనే విజయం సాధిం చినట్లు చెప్పారు. నిండ్ర మండలంలో పార్టీ ముఖ్య నాయకుడు చక్రపాణిరెడ్డి చేసిన కృషి మరువలేనిదని తెలిపారు.
నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. గతంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని, ఈ విషయంలో ఎమ్మెల్యేగా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా పోరా టం చేస్తామన్నారు. చక్రపాణిరెడ్డి వుట్లాడుతూ ఎమ్మెల్యేగా రోజాను గెలిపించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలి పారు.
గ్రామాల్లోని సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ నాయుకులు ఆర్కే.సెల్వవుణి, వునోహర్‌నాయుడు, శ్యామ్‌లాల్, మురళినాయుుడు, నాగభూషణంరాజు, అనిల్‌కువూర్, మేరి, దీప, భాస్కర్‌రెడ్డి, సుందరరామిరెడ్డి, ఎంపీటీసీలు పరందావుయ్యు, చెంచవ్ము, పవిత్ర, నాదవుునస్వామి, గోపి, దశరథనాయుడు, దామోదరం, రావుచంద్రయ్యు, రేవతి, తదితరులు పాల్గొన్నారు.
రోజాకు ఘన స్వాగతం
కొప్పేడు గ్రామంలో ఆర్కే.రోజాకు ప్ర జలు ఘనస్వాగతం పలికారు. కర్పూర హారతులు పట్టారు. గ్రావుంలో నిర్వహించిన రోడ్‌షోకు అపూర్వ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.