sucside
-
తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
గొల్లపల్లి : తల్లి మందలించిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రాఘవపట్నం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొలగాని కళావతి, జలపతి దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో భాగ్యశ్రీ(19) డిగ్రీ వరకు చదువకుని కాలేజీ మానేసింది. ఏడాదిగా ఇంటి వద్దే ఉంటూ బీడీలు చేస్తోంది. కొంతకాలంగా రక్తహీనతతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. బలపాలు తినే అలవాటు ఉండడంతో రక్తహీనత వ్యాధి నయం కావడంలేదని తల్లిదండ్రులు తరచూ మందలిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై ఉపేంద్రాచారి కేసు నమోదు చేశారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపట్నంకు చెందిన మునిగాల అంజయ్య (48) అప్పులబాధతో గ్రామశివారులోని పశువుల కొట్టం వద్ద ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో 4.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.5లక్షలకు పైగా అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరో సంఘటనలో వెదురుగట్టకు చెందిన పంబాల లచ్చయ్య(45) ఈనెల 8న పొలం వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. లచ్చయ్యకు గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. రూ.పది లక్షలకు పైగా అప్పులున్నాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్థాపంతో ఈనెల 8న చేను వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. -
కూతురుతోసహా తల్లి ఆత్మహత్య
► అనారోగ్యాన్ని భరించలేక బావిలో దూకి అఘాయిత్యం ► మల్యాలలో ఘటన చందుర్తి(కరీంనగర్): అనారోగ్యం భరించలేక ఓ మహిళ తన కూతురుతోసహా ఆత్మహత్య చేసుకుంది. తాను చనిపోతే రెండేళ్ల తన కూతురు బతకలేదని చిన్నారితో సహా బావిలో దూకింది. ఈ విషాద సంఘటన చందుర్తి మండలం మల్యాలలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన మదాం సుజాత(32) రెండు నెలలుగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతోంది. చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన సుజాత ఉదయం కొడుకు వంశీ(10)ని పాఠశాలకు పంపించింది. భర్త, కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగానే తన కూతురు విష్నిత(2)ను తీసుకుని గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త సంతోష్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా తల్లి, కూతురు కనిపించలేదు. చుట్టు పక్కల వ్యవసాయ బావుల్లో గాలించగా గ్రామ శివారులోని బావిలో ఇద్దరూ శవమై కనిపించారు. చందుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. సుజాత తండ్రి గొంటి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు.