సున్నాతో ముగించారు
బీజింగ్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత్ పతకాల వేట ముగిసింది. పతకం మీద ఆశలు రేపిన వికాస్ గౌడ శనివారం నిరశపరచగా.. ఆదివారం మారథాన్ లో భారత అథ్లెట్లు నేషనల్ రికార్డుతో సరిపెట్టుకున్నారు. ఓపీ జైషా 2:34:43 టైమింగ్ తో నేషనల్ రికార్డు నెలకొల్పింది. మరో రన్నర్ సుధాసింగ్ 2:35:35తో వ్యక్తిగత రికార్డు మెరుగుపరుచుకుంది. దీంతో భారత్ పతకాల జాబితాలో చిట్ట చివరి స్థానంతో సరిపెట్టుకుంది.
ఇక లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే ఇధియోపియా నుంచి మారే డిబాబా మారథాన్ స్వర్ణం గెలుచుకోగా.. కెన్యా రన్నర్ హెలత్ రెండో స్థానంలో నిలిచింది.