ఐరాస యూనిట్‌కు తిరిగి ఎన్నికైన భారత రాయబారి
ఐక్యరాజ్యసమితి: భారత అగ్రశ్రేణి రాయబారి అచంకులగరే గోపీనాథన్ ను ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ... యూఎన్ ఉమ్మడి దర్యాప్తు సంస్థ(జేఐయూ)కు మళ్లీ సభ్యుడిగా నియమించింది. గోపీనాథన్ తో పాటు సుకాయ్ ప్రోం జాక్సన్ (జాంబియా), జీన్ వెస్లీ(హైతీ), లోజిన్ స్కీ(రష్యా) కూడా సభ్యులుగా నియమితులయ్యారు. వీరు 2018 జనవరి1 నుంచి ఐదేళ్లు ఈ పదవిలో ఉంటారు.
గోపీనాథన్ ను భారత్ ప్రతిపాదించగా, ఆసియా పసిఫిక్ బృందం తన ఏకైక అభ్యర్థిగా ఆమోదం తెలిపింది. ఆయన తొలిసారి 2013 జనవరి నుంచి 2017 డిసెంబర్ వరకు ఈ పదవికి ఎన్నికయ్యారు. ఆ సమయంలో 183 ఓట్లకు గాను 106 ఓట్లు సాధించి చైనా రాయబారి జాంగ్ యాన్‌ను ఓడించారు. ప్రస్తుతం ఉమ్మడి దర్యాప్తు సంస్థకు చైర్మన్ గా పనిచేస్తున్నారు.