రాజస్థాన్ లో బీజేపీకి షాక్
జైపూర్: రాజస్థాన్ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీకి ఎదురుగాలి వీచింది. నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెల్చుకుంది. మిగిలిన మూడు స్థానాలను విపక్ష కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వియర్, సురజ్గఢ్, నసీరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
కోట దక్షిణ నియోజవర్గంలో బీజేపీ అభ్యర్థి సందీప్ శర్మ విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి శివకాంత్ నంద్వానాపై 25 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గత సాధారణ ఎన్నికల్లో ఎంపీలుగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవులు వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమైయ్యాయి