టి20 ప్రపంచకప్‌కు హాంకాంగ్, నెదర్లాండ్స్
అబుదాబి: వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు హాంకాంగ్, నెదర్లాండ్స్ జట్లు అర్హత సంపాదించాయి. బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చే ఈ మెగా ఈవెంట్లో టెస్టు దేశాలతో పాటు ఐసీసీ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా అర్హత సాధించిన జట్లు ఆడనున్నాయి.
గురువారం ఇక్కడి జయేద్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ 29 పరుగుల తేడాతో పాపువా న్యూ గినియా (పీఎన్జీ)పై గెలిచింది. మొదట హాంకాంగ్ 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పీఎన్జీ 108 పరుగులకు ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 8 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై ఘనవిజయం సాధించింది. వచ్చే మార్చిలో జరిగే మెగా ఈవెంట్లో హాంకాంగ్, నెదర్లాండ్స్, అఫ్ఘానిస్థాన్, ఐర్లాండ్, నేపాల్, యూఏఈలు అర్హత సాధించాయి.