కేసీఆర్‌కు బహుమతిగా అరుదైన నాణెం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు టీఆర్ఎస్ఎం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తక్కెళ్లపల్లి దేవేందర్‌రావు అరుదైన నాణేన్ని బహూకరించారు. శనివారం అసెంబ్లీలో సీఎంను కలిసిన ఆయన గియాసుద్దీన్ తుగ్లక్ కాలంనాటి నాణేన్ని అందజేశారు. స్వతహాగా దేవేందర్‌రావు నాణేలను సేకరిస్తున్నారు. ముఖ్యమంత్రికి బహూకరించిన నాణెం... కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేసి ఆక్రమించిన యువరాజు మహ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్‌లో ముల్కీ తిలాంగ్ పేరిట మింట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు. కాకతీయ సామ్రాజ్యంపై విజయ సూచికగా అప్పట్లో తన తండ్రి గియాసుద్దీన్ పేరిట నాణేన్ని ముద్రించారు. అప్పటి నాణేన్నే దేవేందర్‌రావు ముఖ్యమంత్రికి అందజేశారు. అంతటి అరుదైన నాణేన్ని బహూకరించిన ఆయనకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.