Talakorivi
-
మాచవరంలో ఉట్టిపడుతున్న జాతీయభావం
సలామ్... ఆర్మీలో చేరిన 11 మంది యువకులు దేశ సేవకు అంకితం కఠినతరమైన విధులే అయినా సంతృప్తికరం దేశరక్షణకు ఈ మాత్రం కష్టం తప్పదంటున్న యువకులు యువతకు ఆదర్శం ఈ జవాన్లు ‘నీ తల్లిమోసేది నవ మాసాలేరా...! ఈ తల్లి మోయాలి కడవరకు రా..! కట్టే కాలే వరకు రా...!! ఆ రుణం తలకొరివితో తీరేను రా... ఈ రుణం ఏ రూపాణ తీరేనురా..?’ అని ఓ సినీ గేయ రచయిత రాసినట్టుగానే తల్లి కన్నా దేశం గొప్పదే. ఎందుకంటే మనం కట్టెల్లో కాలేవరకు మోసేది మన దేశమే.. మరి, మనం పుట్టి పెరిగి పెద్దయినా ఈ దేశం కోసం ఏం చేయగలం?.. ఎలా చేయగలం?.. దేశం రుణం తీర్చుకోవడానికి దారేది..? అని ఆలోచించి దారి వెతుక్కున్నారు మాచవరం గ్రామానికి చెందిన 11 మంది యువకులు. ఆర్మీలో చేరి దేశరక్షణకు కాపలా కాస్తున్నారు. సైనికులుగా దేశానికి సేవచేసే అదృష్టం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు మాచవరం యువకులు. వారిలో ఓ ముగ్గురు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడి తమ మనోగతాన్ని పంచుకున్నారు. - మెదక్ -
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
చౌటుప్పల్ : మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు నీల అంజయ్య (55), మణేమ్మలకు ఏడుగురు కుమార్తెలు. కుమారులు లేరు. ఆరుగురు కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కూతురు రాణి వివాహం కాలేదు. ప్రస్తుతం కూలీ పనులకు వెళ్తోంది. వీరిది రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం. ఎలాంటి ఆస్థిపాస్తులు లేవు. అంజయ్య గీత కార్మికుడు. కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందాడు. శుక్రవారం అంత్యక్రియలను నిర్వహించారు. కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు రాణి తలకొరివి పెట్టింది. కాగా, మృతుడి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని సర్పంచ్ కప్పల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ బత్తుల శంకర్, ఉప సర్పంచ్ టి.వెంకటేశం, వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.