- సలామ్...
- ఆర్మీలో చేరిన 11 మంది యువకులు
- దేశ సేవకు అంకితం
- కఠినతరమైన విధులే అయినా సంతృప్తికరం
- దేశరక్షణకు ఈ మాత్రం కష్టం తప్పదంటున్న యువకులు
- యువతకు ఆదర్శం ఈ జవాన్లు
‘నీ తల్లిమోసేది నవ మాసాలేరా...! ఈ తల్లి మోయాలి కడవరకు రా..! కట్టే కాలే వరకు రా...!! ఆ రుణం తలకొరివితో తీరేను రా... ఈ రుణం ఏ రూపాణ తీరేనురా..?’ అని ఓ సినీ గేయ రచయిత రాసినట్టుగానే తల్లి కన్నా దేశం గొప్పదే. ఎందుకంటే మనం కట్టెల్లో కాలేవరకు మోసేది మన దేశమే.. మరి, మనం పుట్టి పెరిగి పెద్దయినా ఈ దేశం కోసం ఏం చేయగలం?.. ఎలా చేయగలం?.. దేశం రుణం తీర్చుకోవడానికి దారేది..? అని ఆలోచించి దారి వెతుక్కున్నారు మాచవరం గ్రామానికి చెందిన 11 మంది యువకులు. ఆర్మీలో చేరి దేశరక్షణకు కాపలా కాస్తున్నారు. సైనికులుగా దేశానికి సేవచేసే అదృష్టం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు మాచవరం యువకులు. వారిలో ఓ ముగ్గురు ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడి తమ మనోగతాన్ని పంచుకున్నారు.
- మెదక్