ఉద్యోగాల మార్పు కోసం 49 శాతం మంది...
టాలెంట్ఎడ్జ్ సర్వే..
ముంబై: వచ్చే ఏడాది చాలా మంది ఉద్యోగులు ఉద్యోగాలు మార్పు కోరుకుంటున్నారు. 2017లో దాదాపు 49%కి పైగా ఉద్యోగులు జాబ్ మారాలని భావిస్తున్నారని ఈడీ–టెక్ సంస్థ టాలెంట్ఎడ్జ్ తన నివేదికలో పేర్కొంది. ఇక 50%కి పైగా ఉద్యోగులు గణనీయమైన ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగాలు మారడానికి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలు కారణమని పేర్కొంది.
నివేదికలోని ప్రధానాంశాలు..
⇔ తమ భవిష్యత్ అంచనాలపై డీమోనటైజేషన్ ఎలాంటి ప్రభావం చూపలేదని సర్వేలో పాల్గొన్న చాలా మంది అభిప్రాయపడ్డారు.
⇔ నోట్ల రద్దు వల్ల రానున్న రోజుల్లో ఆర్థిక వ్య వస్థ బలమైన వృద్ధి బాటలో పయనిస్తుందని వారు అంచనా వేశారు.
⇔ 25–30 ఏళ్ల వయసు గ్రూప్ ఉద్యోగులతో పోలిస్తే.. 21–24 ఏళ్ల వయసు గ్రూప్ వారు ఉద్యోగాలుమారడానికి ఆసక్తి చూపడం లేదు.
⇔ 25–30 ఏళ్ల వయసులో ఉన్న ఉద్యోగులు వచ్చే ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశావహంగా ఉంటే.. 21–24 ఏళ్ల వయసులో ఉన్న ఉద్యోగులు మాత్రం 2017లో ప్రమోషన్లు బాగుంటాయని ఆశిస్తున్నారు.