'నా కూతురు సమస్యలకు నేనే కారణం'
నా కూతురి సమస్యలకు తానే కారణమని హాలీవుడ్ నటి డెమీ మూర్ అన్నారు. మద్యం, డ్రగ్స్ కు బానిసైన తన కూతురు తల్లులా వాటి నుంచి బయటపడేందుకు రిహాబిలిటేషన్ సెంటర్ లో చేరింది. తన భర్త అష్టన్ కుచ్చర్ తో విడిపోయి.. తాను సమస్యల్లో కూరుకుపోయానని మూర్ అన్నారు.
ప్రస్తుతం ఓ రిహాబిలిటేషన్ సంస్థలో చికిత్స పొందుతున్న తన కూతురు పరిస్థితి మెరుగు పడుతోందని డేమీ మూర్ తెలిపారు. సమస్యలతో బాధపడుతున్న తన తల్లికి పెద్ద కూతురు రుమెర్ బాసటగా నిలిచింది.
త్వరలోనే తన తల్లి, చెల్లి సమస్యల నుంచి బయటపడుతారనే ఆశాభావంతో రుమెర్ ఉన్నారు. డేమీ మూర్ కు బ్రూస్ విల్లీస్ ద్వారా కలిగిన మరో కూతురు స్కౌట్ కూడా ఉన్నారు.