Tappatadugu
-
అడుగులు తడబడితే...
ప్రేమలో అడుగులు తడబడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తప్పటడుగు’. లక్ష్మణ్, సురభి స్వాతి జంటగా శ్రీ అరుణ్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ గ్రామీణ ప్రేమ కథను చాలా అందంగా తెరకెక్కించాం, తమిళంలో కూడా విడుదల చేస్తున్నాం’’అని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: సాయి మధుకర్, కెమెరా: కర్ణ, ఎడిటింగ్: వరప్రసాద్ పరుచూరి. -
ఫ్యామిలీ డ్రామాతో....
ఓ తప్పటడుగు జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? అనే కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘తప్పటడుగు’. ఎ.ఎస్.ఎస్.వి అటిలియర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అరుణ్ రూపొందించారు. లక్ష్మణ్, సురభిస్వాతి, సూర్యతేజ, నవీనజాక్సన్ హీరోహీరోయిన్లు. ఈ నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నామనీ, ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుందనీ అరుణ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి మధుకర్, కెమెరా: కర్ణ, సహ నిర్మాత: వి. రామకృష్ణ. -
తప్పటడుగు మూవీ స్టిల్స్