గిరిజన గ్రామాలకు సౌర విద్యుత్
బల్బులు అందింజేతకు టెరీ ఓకే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ సౌకర్యంలేని మారుమూల గిరిజన గ్రామాలకు సోలార్ విద్యుత్ ల్యాంపులను అందించేందుకు టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(టెరీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ బల్బులు అందించేందుకు ఏమాత్రం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ సంస్థల నిధులతో సోలార్ విద్యుత్ ల్యాంపులను అందిస్తారు.
ఏపీ సీఎం చంద్రబాబు సూచనల మేరకు శుక్రవారం టెరీ సంచాలకులు ఆర్కే పచౌరీతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు భేటీ అయ్యారు. పర్యావరణహితంగా ఏపీ నూతన రాజధానిని ఎలా తీర్చిదిద్దాలన్న అంశంలో ప్రభుత్వానికి ఉత్తమ పద్ధతులు, సహాయ సహకారాలు అందించేందుకు టెరీ ముందుకొచ్చింది.