‘తెలంగాణ’లో అందరికీ సమన్యాయం
కరీంనగర్‌కల్చరల్, న్యూస్‌లైన్ : ఆత్మగౌరవం, సమానత్వం, సమన్యాయం అజెం డాతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని టీఆర్ఎస్ శాసనసభపక్ష ఉపనేత టి.హరీష్‌రావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ పురాతన పాఠశాల మైదానంలో తె లంగాణ క్రిస్టియన్ ఫోరం ఆవిర్భావసభ, క్రిస్మస్ వేడుకలు ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి కులం, మతం లేదని, నాలుగు కోట్ల ప్రజల ఆరాటం, గుండె చప్పుడని అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం అసెంబ్లీ తీర్మానం అడగడం లేదని, కేవలం అభిప్రాయం మాత్రమే అడుగుతుందని అన్నారు. అయినా అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటామని సీఎం అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
క్రైస్తవులంతా ఐకమత్యంగా ఉండాలని, అప్పుడే హక్కులు సాధించగలరని సూచించారు. గత ప్రభుత్వాలు క్రైస్తవులకు కనీసం సమాధుల కోసం కూడా స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ల కమ్యూనిటీ హాల్స్, మ్యారేజి హాల్స్, చర్చిలకు విద్యుత్ సబ్సిడీ అందిస్తామన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ క్రైస్తవులకు సంపూర్ణ రక్షణగా టీఆర్ఎస్ ఉంటుందన్నారు. రెవ.డాక్టర్ పాల్సన్రాజ్, రెవ.డాక్టర్ జయప్రకాశ్ మాట్లాడుతూ క్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తూ ప్రపంచ శాంతికి కృషిచేయాలని సూచించారు. ఫోరం ఏర్పాటు సందర్భంగా ప్రార్థనలు చేశారు. క్రిస్టియన్ ఫోరం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి కె.జోరం, జిల్లా అధ్యక్షుడు బి. సురేశ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి ఆనంద్, సర్దార్ రవీందర్‌సింగ్, ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి, కె.వినయ్‌కుమార్, జి.కృపాదానం, బందెల సత్యం, వినయసాగర్, సూర్యప్రకాశ్ శాతల్ల సాగర్, ఆనంద్, వినోదమ్మ, ఎలివే, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫోరం గౌరవాధ్యక్షుడిగా హరీష్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.