సౌదీ జైలులో అరణ్యరోదన
- జెడ్డా జైలులో 300 మంది తెలంగాణ వలస జీవులు
- ఆంక్షల మధ్య చిక్కిన అభాగ్యులు
- అవుట్ పాస్‌పోర్టుల కోసం నిరీక్షణ
సిరిసిల్ల: పొట్టచేతపట్టుకుని గల్ఫ్ వెళ్లిన వలస జీవులు అక్కడి జైలులో మగ్గుతున్నారు. సౌదీ అరేబియాలో సంక్షోభం నేపథ్యంలో అక్కడ పని చేయలేక.. ఇంటికి వచ్చేందుకు సిద్ధమైనవారికి అవుట్ పాస్‌పోర్టులు కరువ య్యారుు. దీంతో నెలల తరబడి సౌదీ అరేబియా లోని జెడ్డా జైలులో ఉంటున్నారు. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన పలువురు వలసజీవులు కన్నీటి కష్టాలను ‘సాక్షి’కి సోమ వారం వివరించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రవాసీ తెలంగాణ మంత్రి కె.తారక రామారావు తమను విడిపిం చేందుకు చొరవ చూపాలని బాధితులు కోరుతున్నారు.
ఆంక్షల మధ్య చిక్కిన వలసజీవులు..
గల్ఫ్‌లోని స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వివిధ కంపెనీల్లో ఉన్న విదేశీయులను ఇంటికి పంపించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణరుుంచింది. దీంతో తెలంగాణ జిల్లాలకు చెందిన వలస జీవులను ఇంటికి చేరాల్సిన పరిస్థితి ఎదురైంది. ఊరిలో అప్పులు తీరక ఇంటికి వెళ్లితే వేధింపులు తప్పవనే భయంతో చాలామంది కంపెనీ లను విడిచి పెట్టి బయట పనులు చేస్తున్నారు. చేతిలో పాస్‌పోర్టు లేకుండా నివాసం ఉంటున్న వలస జీవులను అక్కడి పోలీసులు జైలులో వేశారు. ఇలా అక్కడి జైలులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు పెద్దూరుకు చెందిన బర్కం నారాయణ(34), ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్‌కు చెందిన వట్టెల రవి, గంభీరావుపేట మండలం ముచ్చర్లకు చెందిన యాడారం బాబు, కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం గుండి గోపాల్‌రావు పేటకు చెందిన పెంటల రాములు, జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం తూంగూరుకు చెందిన షరీఫ్, మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన షకీల్, నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చాంద మండలం బడ్డెపల్లికి చెందిన రాజ దేవులా, నిర్మల్ మండలం ఎల్లపల్లికి చెందిన ఎత్తరి ఎల్లయ్య, మామిడి మండలం పరిమండల్‌కు చెందిన సాకలి మోహన్, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శివాజినగర్‌కు చెందిన అజ్మీరా లక్ష్మణ్‌లతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వెంకటి, సాగర్‌రెడ్డి, ఎరన్న్ర, బాల కిషన్, ఎల్లయ్య, గంగాధర్, మహేశ్, సత్తయ్య, ఆంజ నే యులు, ముత్తయ్యలతో తదితరులు జెడ్డా జైలులో ఉన్నా రు. తెలంగాణ 31 జిల్లాలకు చెందిన 300 మంది వలస జీవులు అవుట్ పాస్‌పోర్టు లేక జైలులో మగ్గుతున్నారు.
పట్టించుకోని ఎంబసీ అధికారులు..
అక్కడి మన ఎంబసీ అధికారులు జైలులో భారతీయు లను వారిచ్చిన చిరునామా ఆధారంగా గుర్తించి అవుట్ పాస్‌పోర్టు జారీ చేయాల్సి ఉంది. ఎంబసీ అధికారుల్లో అత్యధికులు కేరళ రాష్ట్రానికి చెందిన వారు ఉండడంతో తెలంగాణ వలస జీవులను పట్టించుకోవడం లేదని జైలులో ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో పడిన వారం, పది రోజుల్లోనే అవుట్ పాస్‌పోర్టు ఇవ్వాల్సి ఉండగా 3 నెలలుగా జైలులో ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు.