దుద్దుకూరులో భారీ అగ్నిప్రమాదం
దేవరపల్లి( పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో చెరువుగట్టుపై నిర్మించుకున్న 40 పూరిళ్లు అగ్ని శిలల్లో దగ్ధమైనట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందినట్టు సమాచారం.
లక్షల రూపాయల్లో భారీగా ఆస్తినష్టం వాటిలినట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా కట్టుకున్న గూడు కళ్లముందే బూడిద కావడంతో బాధితులంతా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.