thatcted houses
-
అగ్ని ప్రమాదం: 12 గుడిసెలు దగ్ధం
కృష్ణా : ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకొని గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన సోమవారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండల కేంద్రంలోని పూలరాజుకాలువగట్టు దగ్గర జరిగింది. వివరాలు..మండల కేంద్రంలోని పూలరాజు కాలువగట్టు(హైజాక్ కాంపౌండ్)లో వలస కార్మికులు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం పక్కనున్న గడ్డివాముకు నిప్పంటుకొని మంటలు వ్యాపించడంతో 12 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో దాదాపు 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెవిన్యూ అధికారులు ఈ ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. -
వేపాడలో అగ్నిప్రమాదం
వేపాడ(విజయనగరం జిల్లా): ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పుంటుకొని ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన సోమవారం విజయనగరం జిల్లా వేపాడ మండలం అతవ గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామంలోని ఒక ఇంటిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గ్రామంలో పూరిళ్లు కావడంతో వెంటనే పక్కనున్న గుడిసెలకు సైతం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఎస్‌కోట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలాన్ని రెవిన్యూ అధికారులు, పోలీసులు పరిశీలించారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు.