వేపాడ(విజయనగరం జిల్లా): ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పుంటుకొని ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన సోమవారం విజయనగరం జిల్లా వేపాడ మండలం అతవ గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామంలోని ఒక ఇంటిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గ్రామంలో పూరిళ్లు కావడంతో వెంటనే పక్కనున్న గుడిసెలకు సైతం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఎస్‌కోట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలాన్ని రెవిన్యూ అధికారులు, పోలీసులు పరిశీలించారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు.
వేపాడలో అగ్నిప్రమాదం
Published Mon, Mar 30 2015 8:57 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement