Thiruvothiyur
-
పెళ్లై 2 నెలలు కూడా కాలేదు.. నవ వరుడు ఆత్మహత్య
తిరువొత్తియూర్/తమిళనాడు: భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో నవ వరు డు ఆత్మహత్య చేసుకున్నాడు. పోవై పులియకులంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. దామునగర్కు చెందిన లక్ష్మణ్ కుమారుడు రంజిత్ కుమార్ (27)కు కొత్తగిరి సమీపంలోని కట్టబెట్టు మడియావాడకు చెందిన యువతి(21)తో మే 23న వివాహం జరిగింది. వారం క్రితం ఇద్దరూ యువతి ఇంటికి వెళ్లారు. అయితే రంజిత్ కుమార్‌తో వెళ్లడానికి యువతి నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఆదివారం పొలంలోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని కోత్తగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. కుమారుడు మృతి.. తండ్రి ఆత్మహత్య టీ.నగర్: కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోయంబత్తూరులో ఆదివారం చోటుచేసుకుంది. వేలాండిపాళయం తిలకర్‌వీధికి చెందిన కార్తిక్ (36) ప్రైవేటు సంస్థ ఉద్యోగి. ఇతని మూడేళ్ల కుమారుడు కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తిక్ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతిచెందాడు. పీలమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
మరదలిని హత్య చేసిన వదిన
తిరువొత్తియూరు: మూర్చరోగంతో చికిత్స పొందుతున్న భర్త చెల్లెలిని ఓ వదిన కిరాతకంగా హత్య చేసింది. తన చికిత్స కోసం ఎక్కువ నగదు ఖర్చు పెడుతున్నాడనే కోపంతో చిన్నారిని అని చూడకుండా బావిలో తోసి హత్య చేసింది. ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుప్పూర్ జిల్లా గాంగయం సమీపంలోని సేమలై వలసు గ్రామానికి చెందిన శ్రీరంగన్. అతని భార్య తిరుమాయి. వీరికి కుమారుడు కార్తిక్, కుమార్తె కలైవాణి (8) ఉన్నారు. తిరుమాయి కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. తండ్రి రెండో వివాహం చేసుకోవడంతో కార్తీక్, కలైవాని నాన్నమ్మ తల్లి పెంపకంలో ఉన్నారు. కలైవాణి అక్కడున్న పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. కొన్నాళ్లక్రితం కార్తిక్‌కు షామిలి (19) అనే యువతితో వివాహమైంది. కాగా, మూర్చ వ్యాధిలో చికిత్స పొందుతున్న కలైవాణి.. 2019 జూలైలో హఠాత్తుగా అదృశ్యమైంది. చిన్నారి కోసం గాలించగా ఊరి చివరున్న బావిలో శవంగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. కలైవాణిని వదిన షామిలి బావిలో తోసి హత్య చేసినట్టు తెలిసింది. కలైవాణి మూర్చ రోగానికి తన భర్త ఎక్కువగా ఖర్చు చేస్తుండటంతో అది షామిలికి నచ్చలేదు. దీంతో చిన్నారిని బావి వద్దకు తీసుకెళ్లి తొంగిచూడమని చెప్పి ఆమెను బావిలోకి తోసి హత్య చేసినట్టు షామిలి ఒప్పుకోవడంతో పోలీసులు నిందితురాలిని శనివారం అరెస్టు చేశారు. -
స్నేహితురాలిని హత్య చేసి పూజలు
స్నేహితురాలిని హత్య చేసి పాతిపెట్టిన స్థలంలోనే ప్రేతాత్మకు భయపడి పూజలు చేసిన స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాగై జిల్లా ఉత్తరపు పొయ్గై నల్లూర్ కరైకులంలో ఉన్న ఖాళీ మైదానంలో 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం రోజున పువ్వులు, అగరవత్తులు, గాజు, రిబ్బన్ తదితరాలను అక్కడ ఉంచి పూజలు చేసి ఉండడం అక్కడి వారికి అనుమానం కలిగింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న వేలాంకన్ని పోలీసులు అక్కడికి వెళ్లి పూజలు చేసి ఉన్న స్థలంలో మట్టిని తవ్వి చూడగా అక్కడ ఓ యువతి శవం బయట పడింది. విచారణలో హతురాలు నాగై అక్కరై పేట దిడీర్ కుప్పానికి చెందిన జాలరి సింగారవేలు - దైవయానై దంపతుల కుమార్తె సూర్య అని తెలిసింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి అదే ప్రాంతానికి చెందిన ఆమె స్నేహితుడు జ్ఞానవేల్ (23), అతని మిత్రుడు దీపన్రాజ్ (23) సింగ శశికుమార్ (19) మరో 17 ఏళ్ల యువకులు ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో ఐదుగురు సూర్యను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. విచారణలో జ్ఞానవేలు, సూర్యను ప్రేమించాడు. గత సంవత్సరం సూర్య గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. ఆ తరువాత వీరిద్దరి ప్రేమకు సూర్య తల్లిదండ్రులు అడ్డుచెప్పారు. సూర్య గర్భిణి అయిన సంగతి బయట తెలియడంతో ఆమెను అందరూ తక్కువగా చూశారు. జ్ఞానశేఖర్‌కు చెడ్డ పేరు రావడంతో స్నేహితురాలిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. గత నెల 30వ తేదీ సూర్యను జ్ఞానవేల్ కలుసుకుని ఆమెను సమీపంలో ఉన్న మనోన్మణి ఆలయం వద్దకు రప్పించాడు. అక్కడ బైకులో సిద్ధంగా ఉన్న జ్ఞానవేల్, అతని మిత్రులు దీపన్ రాజ్‌ల సహాయంతో సూర్యను బైకులో సముద్ర తీరం వద్దకు తీసుకెళ్లారు. కారైకులం వద్ద బైకును స్నేహితునికి ఇచ్చి సూర్య, జ్ఞానవేల్ రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు. మరుసటి రోజు స్నేహితులు నలుగురు సూర్య, జ్ఞానవేల్ ఉన్న స్థలం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో నలుగురు ఆమెపై దాడి చేశారు. జ్ఞానవేల్ బ్లేడుతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తరువాత రెండు అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వి పాతిపెట్టినట్టు తెలిపాడు. ఈ క్రమంలో ప్రేతాత్మకు భయపడి జ్ఞానవేల్ పూజలు చేసినట్టు విచారణలో తెలిసింది.