నేపాల్ ప్రధాని మూడు రోజుల పర్యటన
నేపాల్ ప్రధాని ప్రచండ భారతదేశ పర్యటన నేటినుంచీ ప్రారంభం కానుంది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు విచ్చేసిన నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దహాల్ ప్రచండ... మూడు రోజుల పర్యటన ఈరోజు ప్రారంభమవుతుంది.
నేపాల్ ప్రధానమంత్రిగా ఈ సంవత్సరం ఆగస్టు 4న రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన ప్రచండ.. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరచుకోవడంలో భాగంగా మొదటిసారి ఇండియా సందర్శిస్తున్నారు. భారత పర్యటనలో భాగంగా దహాల్ ఉన్నతస్థాయి ప్రతినిథి వర్గంతో భేటీ కానున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా భారత్ లోని ప్రధాన నాయకత్వంతో దహాల్ చర్చలు జరపనున్నారు. హింమాచల్ ప్రదేశ్ లోని సట్లెజ్ నదిపై నిర్మించిన కాంక్రీట్ డ్యామ్, 1500 మెగావాట్ల సామర్థ్యం గల.. జల విద్యుత్ ను ఉత్పత్తి చేసే నథ్పా జాక్రి జలశక్తి ప్రాజెక్ట్. లను ఆయన సందర్శిస్తారు. శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో కలిసే భారత, నేపాల్ ప్రధాన మంత్రులు.. ప్రతినిథి స్థాయి చర్చలు జరిపిన అనంతరం.. ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.