పాక్‌లో మూడు కొత్త పోలియో కేసులు
పోలియో మహమ్మారి మళ్లీ వెలుగు చూసింది. పాకిస్థాన్‌లో మూడు కొత్త పోలియో కేసులు సోమవారం రికార్డయ్యాయి. బాధితులు ముగ్గురూ ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతానికి చెందినవారని డాన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. పాకిస్థాన్‌లో ఈ ఒక్క సంవత్సరమే కనీసం 66 పోలియో కేసులు వెలుగు చూశాయి.
దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు, పాకిస్థాన్ నుంచి వేరే దేశాలకు వెళ్లే ప్రయాణికులంతా తప్పనిసరిగా పోలియో వాక్సినేషన్ వేయించుకున్నట్లు సర్టిఫికెట్ వెంట ఉంచుకోవాలి. జూన్ 1 తర్వాతి నుంచి ఇది తప్పనిసరి పాకిస్థాన్‌లో నెల రోజులకుపైగా ఉన్న విదేశీయులకు కూడా ఇది తప్పనిసరి. ప్రపంచం మొత్తమ్మీద పాకిస్థాన్‌తో పాటు అఫ్ఘానిస్థాన్, నైజీరియా దేశాల్లో మాత్రమే పోలియో కేసులు మళ్లీ మళ్లీ వస్తున్నాయి.