Tissot
-
కోహ్లి ఇలా ఎందుకు చేశాడు?
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు. ప్రమోషనల్ ఈవెంట్లలోనూ తానే ముందుంటాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా ప్రచారాల్లో పాల్గొంటాడు. మిస్టర్ ఫిట్ క్రికెటర్‌గా పేరొందిన విరాట్ పిచ్‌లో ఉంటేనే సీరియస్. బయట సమయాన్ని చాలా ఉల్లాసంగా సరదాగా గడిపేస్తాడు. దీనిలో భాగంగానే కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టిస్సాట్ వాచ్ కంపెనీ కార్యక్రమానికి విరాట్ హాజరైయ్యాడు. టిస్సాట్ కంపెనీ బాంద్రాలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లి అక్కడికి వచ్చిన ప్రత్యేక అతిథులకు వాచ్‌లను బహుకరించాడు. సత్నం సింగ్, కర్మాన్ కౌర్ తండీ, ఆదిల్ బేడీ, శివానీ కటారియా, సాచికా కుమార్ ఇంగాలె, జెహాన్ దారువాలా, పింకీ రాణీ, మనోజ్ కుమార్‌లు అతిథులుగా ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెన్నిస్ స్టార్ అయిన కర్మాన్ కౌర్ తండీతో ఫొటోకి ఫోజిచ్చాడు. కోహ్లి కంటే కర్మాన్ కౌర్ హైట్ కాస్త ఎక్కువగానే ఉండటంతో ఆఎత్తును సమానం చేసేందుకు అక్కడ ఉన్న మెట్లను వాడాడు. చాలా సరదాగా కేవలం ఫొటో కోసమే మాత్రమే కోహ్లి ఈ పని చేసినప్పటికీ నెటిజన్లు విపరీతంగా స్పందించారు. 'నువ్వేమైనా చేసుకో.. కానీ, ఆడాళ్లు మగాళ్ల కంటే ఎత్తు ఎప్పుడూ కాలేరు’ అని ఒకరు వ్యంగ్యంగా ట్వీట్ చేయగా,‘ ఇప్పటికే క్రికెట్లో ప్రత్యేక స్థానం సంపాదించిన 29 ఏళ్ల కోహ్లినేమో 175 సెం.మీలు. రైజింగ్ టెన్నిస్ స్టార్ 20 ఏళ్ల కర్మాన్ కౌర్ తండీనేమో 183సెం.మీలు. అలాంటిది ఈ పిక్చర్లో కోహ్లినే ఎత్తుగా ఎలా కనిపిస్తున్నాడు. టిస్సాట్కి ప్రచారానికి ఇదెలా ఉపయోగపడుతుంది’ అంటూ మరొకరు స్పందించారు. ‘ వాటే షేమ్. ఒక ఫేమస్ క్రికెటరైన కోహ్లి ఇలా ఎందుకు చేశాడు. కోహ్లి ఇలా అయితే ఎలా’ అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. -
రసం, సాంబార్ ఇష్టం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఉత్తరాదితోపాటూ దక్షిణాది అంటే కూడా మక్కువ ఎక్కువే, ఇక్కడి ప్రజలేకాదు వంటకాలు కూడా ప్రీతికరమైనవేనని బాలివుడ్ నటి దీపికాపదుకొనే అన్నారు.సంప్రదాయ చేతిగడియారానికి ప్రసిద్ది చెందిన స్విస్ వాచ్ ఇండస్ట్రీ వారి కొత్త ఉత్పత్తి ‘టిస్సాట్’ రిస్ట్‌వాచ్‌ను శుక్రవారం చెన్నైలో ఆమె ఆవిష్కరించారు. స్విస్ బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దీపిక శుక్రవారం మధ్యాహ్నం చెన్నైకి చేరుకుని వేలాచ్చేరి ఫినిక్స్మాల్లో స్విచ్ వాచ్ షోరూంను ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి చెన్నై మీనంబాక్కంలోని ఒక స్టార్‌హోటల్‌కు చేరుకుని టిస్సాట్ రిస్ట్‌వాచ్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు, మీడియా వారు అడిగిన అనేక ప్రశ్నలకు సరదాగా జవాబులిస్తూ సందడి చేశారు. తన వద్ద అనేక వాచ్‌లున్నా స్విస్ కంపెనీల వాచ్లకు ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. తాజాగా విడుదల చేసిన వాచ్‌లోని అందాలను వర్ణించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్విస్ కంపెనీకి ఎంబాసిడర్‌గా ఉండడాన్ని గర్వకారణంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను అడిగిన అనేక ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇటీవల కాలంలో మీకు ఇష్టమైన పాట ఏమిటనే ప్రశ్నకు ఎంతోసేపు ఆలోచించా కొద్దిగా టైమ్ ఇవ్వండి ప్లీజ్ అంటూ దాటవేశారు. దక్షిణాదిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా, ఇక్కడి ప్రజలు ఎంతో మంచివారు, సంప్రదాయపరులని అన్నారు. చెన్నైకి వచ్చారు కదా ఇక్కడి వంటకాల్లో ఏవంటే ఇష్టమని ప్రశ్నించగా లొట్టలువేస్తున్నట్లుగా ముఖం పెట్టి రసం, సాంబార్ అన్నమంటే మక్కువ ఎక్కువేనని బదులిచ్చారు. -
టిస్సాట్ వాచ్‌ను ఆవిష్కరించిన దీపిక
ప్రముఖ స్విస్ వాచ్ బ్రాండ్ టిస్సాట్... నూతన శ్రేణి బెల్లా వోరా వాచ్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. కెపిహెచ్బి కాలనీలోని సుజనా ఫోరంమాల్‌లో టిస్సాట్ బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఈ చేతి గడియారాన్ని ఆవిష్కరించారు. టిస్సాట్ వాచ్‌లు సృజనాత్మకతకు మారుపేరని ప్రశంసిస్తూ... ఇటాలియన్లో ‘బెల్లా ఓరా’ అంటే మంచి గడియారమని ఈ సందర్భంగా చెప్పారామె. - హైదరాబాద్, సాక్షి