కోహ్లి ఇలా ఎందుకు చేశాడు? | Kohli trolled for Appearing Taller Than Tennis Star Karman Kaur | Sakshi
Sakshi News home page

కోహ్లి ఇలా ఎందుకు చేశాడు?

Published Tue, Oct 9 2018 4:30 PM | Last Updated on Tue, Oct 9 2018 4:35 PM

Kohli trolled for Appearing Taller Than Tennis Star Karman Kaur - Sakshi

ముంబై:  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు. ప్రమోషనల్ ఈవెంట్లలోనూ తానే ముందుంటాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా ప్రచారాల్లో పాల్గొంటాడు. మిస్టర్ ఫిట్ క్రికెటర్‌గా పేరొందిన విరాట్ పిచ్‌లో ఉంటేనే సీరియస్. బయట సమయాన్ని చాలా ఉల్లాసంగా సరదాగా గడిపేస్తాడు. దీనిలో భాగంగానే కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టిస్సాట్ వాచ్ కంపెనీ కార్యక్రమానికి విరాట్ హాజరైయ్యాడు.

టిస్సాట్ కంపెనీ బాంద్రాలోని ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో  కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లి అక్కడికి వచ్చిన ప్రత్యేక అతిథులకు వాచ్‌లను బహుకరించాడు. సత్నం సింగ్, కర్మాన్ కౌర్ తండీ, ఆదిల్ బేడీ, శివానీ కటారియా, సాచికా కుమార్ ఇంగాలె, జెహాన్ దారువాలా, పింకీ రాణీ, మనోజ్ కుమార్‌లు అతిథులుగా ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెన్నిస్ స్టార్ అయిన కర్మాన్ కౌర్ తండీతో ఫొటోకి ఫోజిచ్చాడు. కోహ్లి కంటే కర్మాన్‌ కౌర్‌ హైట్ కాస్త ఎక్కువగానే ఉండటంతో ఆఎత్తును సమానం చేసేందుకు అక్కడ ఉన్న మెట్లను వాడాడు. చాలా సరదాగా కేవలం ఫొటో కోసమే మాత్రమే కోహ్లి ఈ పని చేసినప్పటికీ నెటిజన్లు విపరీతంగా స్పందించారు.

'నువ్వేమైనా చేసుకో.. కానీ, ఆడాళ్లు మగాళ్ల కంటే ఎత్తు ఎప్పుడూ కాలేరు’ అని ఒకరు వ్యంగ్యంగా ట్వీట్‌ చేయగా,‘ ఇప్పటికే క్రికెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన 29 ఏళ్ల కోహ్లినేమో 175 సెం.మీలు.  రైజింగ్‌ టెన్నిస్‌ స్టార్‌ 20 ఏళ్ల కర్మాన్ కౌర్ తండీనేమో 183సెం.మీలు. అలాంటిది ఈ పిక్చర్‌లో కోహ్లినే ఎత్తుగా ఎలా కనిపిస్తున్నాడు. టిస్సాట్‌కి ప్రచారానికి ఇదెలా ఉపయోగపడుతుంది’ అంటూ మరొకరు స్పందించారు. ‘ వాటే షేమ్‌. ఒక ఫేమస్‌ క్రికెటరైన కోహ్లి ఇలా ఎందుకు చేశాడు. కోహ్లి ఇలా అయితే ఎలా’ అని మరొక నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement