ఓటు బ్యాంకుగానే అగ్ర కులాలు
నిరుపేదలందరికీ రిజర్వేషన్లు వర్తింపజేయాలి
∙ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి
భీమారం : అనాదిగా పాలకులు ఓసీలను ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నారని అగ్రకులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నల్లా భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్ల సాధనకు అగ్రకులాలను ఏకం చేసే దిశగా కార్యాచరణ రూపొందించేందుకు భీమారంలోని బాలాజీ గార్డెన్స్‌లో ఓసీ మహాగర్జన సభ బుధవారం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భాస్కర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కేవలం పదేళ్ల వరకే తొలుత రిజర్వేషన్లు కల్పిస్తే.. రాజకీయ పార్టీల నేతల స్వార్థం వల్ల వాటిని పొడిగిస్తున్నారని విమర్శించారు. తద్వారా ఓసీల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. అన్ని కులాలు, మతాల వారికి రిజర్వేషన ్లతో గుర్తింపునిస్తున్న ప్రభుత్వం అగ్రవర్గాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా ఆర్థికస్థితిగతులను ప్రామాణికంగా తీసుకుని రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, వ్యక్తిగత కక్షలకు ఉపయోగపడుతున్న అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలని భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తొలుత ఓసీ జేఏసీ జెండాను ఆవిష్కరించారు.
ఓసీ సం క్షేమ సంఘాల సమా ఖ్య జిల్లా ఇన్చార్జీ పోలాడి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోçßæన్‌శర్మ, డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ఓసీ జేఏసీ నాయకులు నాగమళ్ల సురేష్, వీసం సురేందర్‌రెడ్డి, పోరెడ్డి కిషన్‌రెడ్డి, పాడి గణపతిరెడ్డి, వీసం కరుణాకర్‌రెడ్డి, చల్లా అమరేందర్‌రెడ్డి, పెండ్యాల కేశవరెడ్డి, చందుపట్ల నర్సింహారెడ్డి, గూడూరు స్వామిరెడ్డి, రజిత, వీణావాణి, వాణిశ్రీ, సరళ తదితరులు పాల్గొన్నారు.