the tour
-
4న సారొస్తారు..!
- సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నం - జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష - అధికారులతో కలిసి నగరంలో పర్యటన సాక్షి ప్రతినిధి,ఖమ్మం: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మే 4, 5 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. గతనెల శ్రీ రామనవమి సందర్భంగా భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం మరోసారి జిల్లా వస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఇక్కడకు వస్తున్నట్లు తెలియవస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇదిగో షెడ్యూల్..అదిగో ఏర్పాట్లు.. ముఖ్యమంత్రి వచ్చేనెల 4వ తేదీ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి నేరుగా ఖమ్మం చేరుకుని ఇక్కడే బస చేస్తారు. 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలిస్తారు. పలు మురికివాడల్లో ఈ పర్యటన కొనసాగుతుంది. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సీఎం చేత అభివృద్ధి పనులను ప్రారంభింపజేసేందుకు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. కేసీఆర్ పర్యటన దాదాపు ఖరారు కావడంతో ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏయే ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారో.. తదితర అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి, ఎస్పీ షానవాజ్‌ఖాసిం, జాయింట్ కలెక్టర్ దివ్య, ఆర్అండ్బీ ఎస్ఈ, ట్రాన్స్‌కో ఎస్ఈ, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులతో సమావేశమై పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లండి.. ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చినప్పటికీ ఇళ్ల స్థలాలు చూపించాల్సి ఉంది. రఘునాథపాలెం మండలం బాలపేట సమీపంలో గతంలో నిర్ణయించిన స్థలంలో దాదాపు 3,400 మందికి పైగా ఇళ్లస్థలాలు ఇప్పించే అంశంపై అధికారులతో మంత్రి చర్చించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం- ఆవశ్యకతను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని తుమ్మల అధికారులకు సూచించారు. ఈ మేరకు బుధవారం మంత్రి, జిల్లా అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న అటవీశాఖకు సంబంధించిన నర్సరీని తుమ్మల సందర్శించారు. వరంగల్ క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఏ మేరకు వినియోగించవచ్చునో అధికారులతో చర్చించారు. అనంతరం రోటరీనగర్‌లో ఉన్న ప్రభుత్వ డెయిరీని మంత్రి పరిశీలించారు. గతంలో ఈ డెయిరీ ప్రదేశంలో నూతన బస్టాండ్ నిర్మించాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి బస్టాండ్ కోసం ఈ స్థలాన్ని పరిశీలించారు. అలాగే రఘునాథపాలెం మండల రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయానికి అనువైన స్థలాన్ని మండలంలోని బల్లేపల్లి తదితర ప్రాంతాల్లో మంత్రి, జిల్లా ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. నగరంలోని రమణగుట్ట, కాల్వొడ్డు, బొక్కలగడ్డ, గోళ్లపాడు చానల్ ప్రాంతాలను పరిశీలించారు. సీఎం 5వ తేదీ నగరంలో భారీ బహిరంగ సభలో పాల్గొనే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే ఆ కార్యక్రమంలో నగరంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం చేతులమీదుగా రుణాలు, యంత్ర పరికరాలను అందించేందుకు సంబంధిత కార్పొరేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. ప్రాధాన్యత సంతరించుకున్న పర్యటన త్వరలో ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని స్పష్టం కావడంతో సీఎం నగర పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు సీఎం పర్యటనకు సంబంధించి భారీ బందోబస్తుకు కసరత్తు ప్రారంభించారు. ఇటు టీఆర్ఎస్ శ్రేణులు సైతం ముఖ్యమంత్రి ఖమ్మం నగరంలో తొలిసారి పర్యటిస్తున్నందున భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ముందుగా మూడు రోజులు పర్యటిస్తారని అనుకున్నప్పటికీ 4, 5 తేదీల్లో మాత్రమే సీఎం పర్యటన ఖరాారైనట్లు అధికారులు చెబుతున్నారు. 6వ తేదీన సీఎం ఢిల్లీ పర్యటన ఉండటంతో 5వ తేదీ సాయంత్రం నగరంలో పర్యటన ముగించుకుని నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. -
భారీ భద్రత నడుమ సీఎం పర్యటన
నెల్లూరు(క్రైమ్) : భారీ భద్రత ఏర్పాట్ల నడుమ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెల్లూరు నగర, కోవూరు పర్యటన సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్యటన ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా పోలీసులతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. గుంటూర్ రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్, సీఎం భద్రత అధికారి చిట్టెయ్యలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చంద్రబాబునాయుడు రేణిగుంట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10 గంటలకు నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకోవాల్సి ఉండగా సుమారు గంట ఆలస్యంగా వచ్చారు. ఉదయం 8.30 గంటలకే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అంచెలవాణి, మాజీ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కంభం విజయరామిరెడ్డి, పరసా రత్నం, బీద మస్తాన్‌రావు, మాజీ ఎంపీ ఉక్కాల రాజేశ్వరమ్మ, నాయకులు బెజవాడ ఓబుల్‌రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, తాళ్లపాక రమేష్‌రెడ్డి, జెడ్.శివప్రసాద్, కిలారి వెంకటస్వామి నాయుడు, నువ్వుల మంజుల, యారం మంజుల, జ్యోత్స్నలత తదితరులు కవాతు మైదానంలోని పోలీసు అతిథిగృహానికి చేరుకున్నారు. విక్రమ సింహపురి వర్సిటీ వీసీ రాజారెడ్డి, సీని యర్ ఐఏఎస్ అధికారులు అనంతరామ్, వాణిమోహన్, కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ సెంథిల్‌కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెం డెంట్ డాక్టర్ కె. శ్రీనివాస్ తదితరులు కూడా ఇక్కడికి వచ్చారు. సుమారు ఉదయం 11.05 గంటలకు వచ్చిన సీఎంకు టీడీపీ నాయకులు, అధికారులు పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు. సమయాభావం కావడంతో పోతిరెడ్డిపాలెంలోని కార్యక్రమాలను అధికారులు రద్దుచేశారు. దీంతో ఆయన ప్రత్యేక వాహనంలో హెలిప్యాడ్ నుంచి రోడ్డుమార్గాన వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకున్నారు. ఇక్కడి బహిరంగ సభ ముగించుకొని మధ్యాహ్నం 2.45 గంటలకు పోలీసు కవాతు మైదానానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం పోలీసు అతిథిగృహంలో ముఖ్యమంత్రి భోజనం చేయాల్సి ఉంది. సమయం మించిపోవడంతో ఆయన ప్రత్యేక బస్సులోనే భోజనం చేశారు. బస్సులోనే కొద్దిసేపు మంత్రి నారాయణ, బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పాటు నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, నూనె మల్లికార్జునయాదవ్లతో పాటు పలువురితో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలీసు కవాతు మైదానం నుంచి మంత్రి నారాయణ, కలెక్టర్‌తో కలిసి ఆయన హెలికాప్టర్లో డక్కిలికి బయలుదేరి వెళ్లారు. టీడీపీ నాయకులు, అధికారులు హెలిప్యాడ్ వద్ద సీఎంకు వీడ్కోలు పలికారు. టీడీపీ సీనియర్ నాయకుడు బెజవాడ ఓబుల్‌రెడ్డి కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లో కూర్చొని ఉండగా ఎండ తీవ్రత కు సొమ్మసిల్లిపడిపోయారు. పార్టీ నాయకులు ఆయన్ను పోలీసు అతిథి గృహంలోకి తీసుకెళ్లి గ్లూకోజ్ నీరు ఇవ్వడంతో తేరుకున్నారు. -
రేపు జిల్లాకు సీఎం రాక
పర్యటనకు విస్తత ఏర్పాట్లు విశాఖ రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 30, 31 తేదీల్లో ఆయన జిల్లా పర్యటించనున్నారు. పర్యటన వివరాలిలా ఉన్నాయి. 30వ తేదీ ఉదయం 7.15 గంటలకి సీఎం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 8.30 గంటలకి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడ 8.45 గంటల వరకు అధికారులతో సమావేశమవుతారు. 9.30 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి 10 గంటలకు అనకాపల్లి నూకాంబిక దేవాలయానికి వెళతారు. దర్శనం అనంతరం కొద్దిసేపు రిజర్వులో ఉంటారు. 11 గంటలకు తుమ్మపాల వెళ్లి 11.30 గంటల వరకు గ్రామస్తులను కలుస్తారు. 11.40 గంటలకు గంధవరం గ్రామస్తులను కలిసి, మధ్యాహ్నం 12.55 గంటలకు చోడవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళతారు. ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు భోజనం, విశ్రాంతి తీసుకుంటారు. మళ్లీ మధ్యాహ్నం 2.40 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చోడవరం ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో రైతులు, ఎన్ఆర్ఈజీఎస్ కార్మికులతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 5.30కు అనకాపల్లి రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్‌కు చేరుకుటారు. అక్కడ 6.30 గంటల వరకు శాస్త్రవేత్తలు, విద్యార్థులతో సీఎం మాట్లాడతారు. అనంతరం 6.30 నుంచి 7.30 గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 7.30 నుంచి 8 గంటల వరకు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 31వ తేదీ.. : 31వ తేదీ ఉదయం 9 నుంచి 11 వరకు ఆర్ఏఆర్ఎస్లోనే ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం 11.15కి కశింకోట బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి 11.45 గంటల వరకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11.50కి తాళ్లపాలెం గ్రామానికి వెళ్లి 12.10 గంటల వరకు అక్కడ స్థానికులను కలుస్తారు. 12.20కి యలమంచిలిలో రోడ్‌షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.50కి బయ్యవరం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కార్మికులు, రైతులతో ముచ్చటిస్తారు. అనంతరం 1.10కి అక్కడ నుంచి బయలుదేరి 1.30 గంటలకు ఉపమాక వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. తరువాత 2 గంటల వరకు స్థానికులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 2.10కి నక్కపల్లికి చేరుకొని అక్కడ భోజనం చేస్తారు. తిరిగి 2.40కి నక్కపల్లిలో బహిరంగ సమావేశంలో ప్రసంగిసాతరు. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు అక్కడ ఏర్పాటు చేసే స్టాల్స్‌ను సందర్శించి స్వయం సహాయక బృందాలను కలుస్తారు. సాయంత్రం 5.15కి నక్కపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 5.45 గంటలకు విశాఖకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి 5.55 గంటలకు స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్‌కు పయనమవుతారు.